రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ ప్రకారం ఈరోజు పేపర్లలో యాడ్లు ఇచ్చింది చిత్రబృందం. అయితే నిజంగా సినిమా అప్పుడు వస్తుందా అంటే అనుమానమే అంటున్నారు. కారణం సినిమా బిజినెస్ ఇప్పటివరకు పూర్తి కాలేదు. డేట్ వేస్తే బిజినెస్ ఊపందుకుంటుంది అని రిలీజ్ డేట్ ప్రకటించారు అంటున్నారు
ఈ సినిమాకు ఆంధ్ర ఏరియా అయిదు కోట్ల రేషియోలో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర అయిదు కోట్లు అంటే ఓ మాంచి మీడియం కమర్షియల్ సినిమా రేంజ్ అనుకోవాలి. ఒక్క ఉత్తరాంధ్రకే కోటి రూపాయల పైనే ఇవ్వాల్సి వుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాలకు అంత సీన్ ఉందా అంటే అనుమానమే.
ఈ మధ్య రాము సినిమాల ట్రైలర్లు వైరల్ అవుతున్న థియేటర్లలో వాటిని చూడటానికి మాత్రం ప్రేక్షకులు ముందుకు రావడం లేదు. పై పెచ్చు ఇటీవలే ఆయన టీడీపీ మీద తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను కోర్టు అడ్డుకుంది. ఈ తలపోట్లు అన్నీ ఎందుకు అని బయర్లు సినిమాలు దూరంగా ఉంటున్నారు. వారిని ఈ మితిమీరిన రేట్లతో మరింత షాక్ కు గురి చేస్తున్నాడు రాము.
పైగా ఎన్నికల తరువాత రాజకీయ సినిమాల మీద ప్రేక్షకులకు అంత ఆసక్తి ఉండదు అనేది కూడా ఒక పాయింటే. దీనితో చివరకు రాము దిగి వస్తాడో లేక సొంతంగా విడుదల చేసి రిస్క్ తీసుకుంటాడో చూడాలి. ఇప్పటికైతే 29న నిఖిల్ అర్జున్ సురవరం సినిమాకు వస్తుంది.



