
పర్యాటక రంగం… సామాన్య ప్రజలకి బొత్తిగా ఆసక్తి లేని సబ్జెక్ట్. మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నవారికి కూడా అదే లాస్ట్ ఛాయిస్. ప్రభుత్వాలు కూడా పర్యాటక రంగంపై ఖర్చు వృధాయే అని భావిస్తుంటాయి. కనుక దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం పరిస్థితి దయనీయంగా ఉంది.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసులో.. జగన్ కూడా?
కానీ పర్యాటక రంగంతోనే నడుస్తున్న చిన్నచిన్న దేశాలు, రాష్ట్రాలు ఈ ప్రపంచంలో అనేకం ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. అయినా పర్యాటక రంగంపై అంతులేని నిర్లక్ష్యం.
ఇందుకు అతి తాజా ఉదాహరణగా మాజీ పర్యాటక మంత్రి రోజా గురించే చెప్పుకోవచ్చు. మంత్రి పదవి కోసం ఆరాటపడిన ఆమెకు పర్యాటకం దక్కడంతో ఆమె దానిని పట్టించుకోకుండా రాజకీయాలతోనే కాలక్షేపం చేసేశారు. ఆమె దాని విలువ గుర్తించి, కొద్దిగానైనా అభివృద్ధి చేసి ఉంటే ఆమె పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయేది.
Also Read – రేపు రెంటపాలకు జగన్.. ఏం ప్లాన్ చేశారో?
కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, దానిలో సినీ, పర్యాటక శాఖ మంత్రిగా చేస్తున్న కందుల దుర్గేష్‌లకు పర్యాటక రంగం విలువ బాగా తెలుసు. అందుకే నిన్న విశాఖలో సీఐఐ అధ్వర్యంలో టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్‌లో తొలిసారిగా ఏపీలో సినీ, పర్యాటక రంగాల అభివృద్ధి గురించి చాలా లోతుగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, ఈ సదస్సులో పాల్గొన్న సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ వంటివారు పలు నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసేందుకు గట్టిగా కృషి చేస్తుందని మంత్రి కందుల హామీ ఇచ్చారు.
Also Read – అమరావతిలో కేంద్ర సచివాలయం… గ్రేట్ ఐడియా!
మంత్రి చెప్పిన విషయాలు: త్వరలో పర్యాటక పాలసీని ప్రకటిస్తాము. పర్యాటక రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పాలసీలో భాగంగా ఏపీకి వెయ్యి కోట్లు మంజూరు చేస్తుంది. దానితో రాష్ట్రంలో ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్ళినా అక్కడ రెండు మూడు రోజులు హాయిగా గడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ఆకర్షణ కేంద్రాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తాము.
విజయవాడకి సినీ పరిశ్రమ తరలివస్తే ప్రభుత్వం-సినీ పరిశ్రమ భాగస్వామ్యంలో సినీ పరిశ్రమకు అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది.
ఏపీలో తీసిన సినిమాలలో పర్యాటక ప్రాంతాల వివరాలు అందరికీ తెలిసేలా చేస్తే పర్యాటకులు పెరుగుతారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు జరిపేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. సినిమా షూటింగ్‌లకు మరింత సులువుగా అనుమతులు మంజూరు చేస్తాము.
రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలు చాలా ఉన్నాయి. నిత్యం వేలాదిమంది భక్తులు వచ్చి దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతుంటారు. కానీ వాటికి అతిసమీపంలో ఉన్న పర్యాటక ఆకర్షణ కేంద్రాలకు చేరుకునేందుకు సరైన రవాణా, సమాచారం, సదుపాయాలు లేకపోవడం వలననే అలా జరుగుతోందని గుర్తించాము. కనుక ప్రతీ పుణ్యక్షేత్రం కేంద్రంగా ఓ సర్క్యూట్ రూపొందించుకొని ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తాము.
రాష్ట్రంలో ఇంతకాలం విశాఖ, కాకినాడ బీచ్ మాత్రమే బాగా ప్రసిద్ది చెందాయి. ఇకపై వివిద జిల్లాలో పర్యాటకానికి అవకాశం ఉన్న సముద్ర తీరాలను గుర్తించి అభివృద్ధి చేస్తాము.
విశాఖ-శ్రీకాకుళం మద్య సముద్రంలో క్రూయిజ్ (విలాసవంతమైన పెద్ద షిప్పులు) నడిపించేందుకు ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వం వారికి అన్ని విదాల సహాయసహకారాలు అందిస్తుంది.
సినీ, పర్యాటక రంగం అభివృద్ధికి ఇటువంటి సరికొత్త ఆలోచనలు, ప్రతిపాదనలతో వచ్చేవారికి ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుంది.