శ్రీదేవి గత శనివారం దుబాయ్ లో మరణించిన సందర్భంగా… ఆమెకు నివాళిగా దేశవ్యాప్తంగా ఉన్న టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికలు నాలుగు రోజులుగా ఆమెకు సంబంధించిన సన్నివేశాలు, పాటలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
న్యూస్ ఛానెళ్లు శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేశాయి. వాటిని పలువురు సినీ ప్రముఖులు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా టీవీ ఛానెళ్ల ప్రసారాలపై అసహనం వ్యక్తం చేస్తూ, సినీ నటి కస్తూరి శంకర్ (కస్తూరి) భిన్నంగా స్పందించింది.
ADVERTISEMENT
శ్రీదేవి మరణిస్తే ఆమె సినిమాల్లోని పాటలు, కొన్ని సన్నివేశాలను అన్ని చానళ్లు ప్రదర్శిస్తున్నాయి. అయితే సన్నీలియోని చనిపోతే ఏం ప్రసారం చేస్తాయి? అని వెటకారంగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో శ్రీదేవి, సన్నీలియోన్ ఫోటోలను పోస్ట్ చేసింది.
ADVERTISEMENT



