తండ్రులు దేవుళ్ళే…అన్నలే.?

Kavitha and Sharmila Problems With Their Brothers

రాజకీయాలకు బంధాలు, బంధుత్వాలు ఉండవని మరోసారి రుజువయ్యింది. తండ్రి చాటు బిడ్డలుగా రాజకీయంలోకి అడుగు పెట్టి ఇప్పుడు ఆ తండ్రినే కడుగుతున్న ‘ముత్యం’ ఒక వైపు ఉంటే, అన్న వదిలిన బాణంగా రాజకీయ అరంగేట్రం చేసి ఆ అన్ననే గుచ్చుతున్న ‘బాణం’ మరో వైపు చూస్తున్నాం.

అయితే ఇక్కడ రెండు తెలుగుల రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుమార్తె కవిత, వైఎస్ఆర్ ముద్దుల కూతురు షర్మిల ఇద్దరు ఒకే రైలు మీద ప్రయాణిస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరు ప్రయాణించేది ఒకే రైలు అయినప్పటికీ పట్టాలు మాత్రం వేరు వేరే.

ADVERTISEMENT

నేడు మీడియా ముందుకొచ్చిన కవిత తన తండ్రి కేసీఆర్ పై తన అన్న కేటీఆర్ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అలాగే ఈ సుదీర్ఘ ప్రెస్ మీట్ లో కవిత చేసిన రెండు ప్రకటనలు కవిత భవిష్యత్ రాజకీయ విధానాన్ని చెప్పకనే చెప్పింది.

* నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పని చేస్తాను, మరెవరిని నా నాయకుడిగా అంగీకరించాను.

** భవిష్యత్ లో కొత్త పార్టీ ఏర్పాటు పై ఎటు తేల్చని వైనం.

ఈ రెండు రాజకీయ ప్రకటనలను పరిశీలిస్తే కవిత బిఆర్ఎస్ భవిష్యత్ నాయకత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. పార్టీలో కేసీఆర్ తరువాత స్థానం కేటీఆర్ దే అనేది పార్టీ ఆవిర్భావ వేడుకలో కేసీఆర్ అనధికారికంగా ప్రకటించేసారు.

బిఆర్ఎస్ 25 వసంతాల వేడుక సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన అన్ని ఫ్లెక్సీలలో కేసీఆర్ కు సమానంగా కేటీఆర్ కు స్థానం కల్పించారు. దీనికి తోడు కేసీఆర్ కుమార్తె గా కవిత కు ఒక్క ఫ్లెక్సీ లో కూడా చోటు కల్పించలేదు.

ఇదే కవితకు బిఆర్ఎస్ లో అభద్రతా భావాన్ని తీసుకువచ్చి ఉండవచ్చు. బిఆర్ఎస్ లో చీలిక తప్పదు, దానికి కారణం హరీష్ రావు అవుతారు అంటూ ఎప్పటి నుంచో తెలంగాణ రాజకీయాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడా చీలికకు కేసీఆర్ కుమార్తె కవిత కారణం అవ్వబోతున్నారా అనేలా నానాటికి పరిస్థితులు కేసీఆర్ చెయ్యి దాటి పోతున్నాయి.

అయితే ఇక్కడ కవిత కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని అంగీకరించను అంటూ బాహాటంగానే చెప్పడంతో, కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ చెప్పిన మాటలో ఆ దెయ్యం మరెవరో కాదు అన్న కేటీఆరే నా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇక్కడ కవిత తన తండ్రిని దేవుడిగా అభివర్ణిస్తూ కేసీఆర్ మద్దతుదారుల అభిమానాన్ని, కేసీఆర్ మద్దతును ఆశిస్తున్నారు. అలాగే ఇటు షర్మిల కూడా తన తండ్రి రాజకీయాన్ని కీర్తిస్తూనే తన అన్న జగన్ ను టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఇద్దరి వాదనలు ఒకేలా కనిపించినప్పటికీ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నమయినవి.

ఇక్కడ షర్మిల తండ్రి వైఎస్ఆర్ ప్రాణాలతో లేరు, కాబట్టి సజీవంగా లేని వారి పై రాజకీయ విమర్శలు చేస్తూ రాజకీయం చెయ్యడానికి ఎవరు ముందుకు రారు. ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం మరణించిన వారి పై రాజకీయాలు చేస్తూ తమ గౌరవాన్ని తగ్గించుకోరు. వైస్సార్ జిల్లా పేరును వైస్సార్ కడప జిల్లాగా మారుస్తూ వైస్సార్ కు తగిన గౌరవం ఇచ్చి ఇందుకు సరైన నిర్వచనం ఇచ్చారు సీఎం బాబు.

కానీ ఇక్కడ కవిత విషయంలో కేసీఆర్ రాజకీయాలలో యాక్టీవ్ గానే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ రాజకీయ ప్రస్థానం సాగుతుంది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటున్నప్పటికీ పార్టీ అధినేతగా అంతిమ నిర్ణయం ఆయనదే అవుతుంది.

కాబట్టి కేసీఆర్ కు కవితా.? కేటీఆర్.? అనే ప్రశ్న ఉత్పన్నమయితే అందుకు కేసీఆర్ తన చర్యలతో బదులు చెపుతారు. కానీ షర్మిల విషయానికి వస్తే వైస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఆమె రాజకీయ ఎదుగుదలకు తల్లి విజయలక్ష్మి సాయమందించారు. కానీ ఇక్కడ కవితకు ఆ అవకాశం లేదనే చెప్పాలి. ఇలా ఈ ఇద్దరు కూడా ఒకే గూటి పక్షులు మాదిరి కనిపించినా రెండు వేరు వేరు జాతులు గానే పరిగణించాలి.

ఈ ఇద్దరి కథలో కవితకు, షర్మిలకు తండ్రి దేవుడే…అన్న రాక్షుసుడే…అలాగే అటు కేటీఆర్, జగన్ దృష్టిలో చెల్లెల్లు కవిత, షర్మిల వీరిద్దరూ వెన్నుపోటుదారులుగానే మిగులుతారు. రాజకీయంలో అవకాశం, అదృష్టంతో పాటుగా రాజకీయ కుట్రలు కూడా తప్పదనేది ఈ సంఘటనలతో రుజువవుతోంది.

ADVERTISEMENT
Latest Stories