
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా, గులాబీ మహిళా నేతగా ఇన్నాళ్లు గులాబీ జెండాను భుజాన మోసిన కవిత తాజాగా బిఆర్ఎస్ కు తనకు మధ్య మొదలైన గ్యాప్ తో గులాబీ కండువాను పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తున్నారు.
నాడు జాగృతి కార్యాలయం ఏర్పాటు సందర్భంగా, నేడు తెలంగాణ ఆవిర్భావదినోత్సవ వేడుకల కారణంగా మీడియాలో ప్రత్యక్షమైన కవిత తన మేడలో కేసీఆర్ గులాబీ కండువాకు బదులు తెలుపు, పచ్చ రంగులతో కూడిన జాగృతి కండువాకును వేసుకున్నారు.
Also Read – సంక్షేమ పధకాలకు ఇంత తొందర ఎందుకు?
కేసీఆర్ కు బిఆర్ఎస్, జాగృతి రెండు రెండు కళ్ళు లాంటివి అంటూ చెప్పుకొచ్చిన కవిత ఎన్నడూ కేసీఆర్ భుజాన కవిత జాగృతి సంస్థకు సంబంధించిన కండువాను కప్పలేదు. కానీ ఇన్నాళ్లు తానూ భుజాన మోసిన, మెడలో ధరించిన గులాబీ జెండాను పక్కన పెట్టి జాగృతి కండువాను కవిత ఇప్పుడు మోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో.?
ఇన్నాళ్లు బతుకమ్మ వేడుకలో మాత్రమే కవిత తన జాగృతి సంస్థ పేరుతో కార్యక్రమాలు నడిపే వారు. కానీ ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సొంత పార్టీని విడిచిపెట్టి, ఆ పార్టీ అధినాయకత్వం నుంచి ఆ కింద స్థాయి నాయకుల వరకు విమర్శలు ఎక్కుపెడుతూ కవిత చేస్తున్న రాజకీయ ప్రయాణం చివరికి జాగృతి తో వెలుగులోకి రానుందా.?
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
కేసీఆర్ కు బిఆర్ఎస్ కేటీఆర్ అయితే జాగృతి కవిత కానున్నారా.? ఇక్కడ బిఆర్ఎస్ లో కవితకు స్థానం లేదు, అక్కడ జాగృతిలో కేటీఆర్ కు హక్కు లేదా.? కండువాలు మార్పు తో మొదలైన కేసీఆర్ కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయం జెండాలు, ఎజెండాలు మారే వరకు సాగేలా కనిపిస్తుంది. మరి ఈ ప్రయాణంలో కేసీఆర్ ఆశీర్వాదం దక్కించుకునే ఆ కన్ను ఎదో.?