
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమెకు భర్త అనిల్, కొడుకు ఆదిత్య, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాధారంగా స్వాగతం పలికారు.
Also Read – విజయసాయి స్టేట్‌మెంట్స్.. కసిరెడ్డి అరెస్ట్: బాగా కిక్ ఇస్తోంది కదా?
కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయటకు వస్తూనే సంచలన వ్యాఖ్యలు చేయడం చాలా ఆసక్తికరం. “నేను కేసీఆర్ బిడ్డని… తెలంగాణ బిడ్డని ఏ తప్పు చేయలేదు. తప్పు చేసే ప్రసక్తే లేదు. కానీ నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు.
నా 18 ఏళ్ళ రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా జైలు జీవితం వలన నేను, నా కుటుంబ సభ్యులు అందరం చాలా బాధపడ్డాము. కానీ నన్ను జైలుకి పంపించినవాళ్ళే నన్ను జగ మొండిగా మార్చారు.
నన్ను, నా కుటుంబాన్ని ఇటువంటి ఇబ్బందులకు గురి చేసినవారికి సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాను. ఈ కష్టకాలంలో నాకు, నా కుటుంబానికి అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికీ చేతులు జోడించి ధన్యవాదాలు పాధాభివందనాలు తెలియజేస్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
ఆమె బయటకు వస్తూనే తమని ఇబ్బందిపెట్టిన వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించడం ఆశ్చర్యకరమే. అయితే అదేమీ యధాలపంగా చేసిన హెచ్చరిక మాత్రం కాదు. ఆమె చెప్పిన్నట్లు కేసీఆర్ మౌనంగా ఉంటున్నా ఆయన కూడా తమని ఇబ్బంది పెడుతున్నవారిని చావుదెబ్బ తీసేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారనే భావించవచ్చు. అదే ఆమె నోట వెలువడింది.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
ఆమె చాలా బాధతో, ఆవేశంతో ఈమాట అన్నప్పటికీ తొందరపాటే అని చెప్పక తప్పదు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారని సీబీఐ, ఈడీలు వాదనలను ఆమె ఈ ఒక్క హెచ్చరికతో అప్పుడే నిరూపించిన్నట్లయింది కదా?
ఇక ఆమెని ఇబ్బంది పెట్టినవారెవరంటే… ఆమెపై ఈ కేసు నమోదు చేయించిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్టానం, ఈ కేసులో అప్రూవర్లుగా మారి ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినవారు అని భావించాల్సి ఉంటుంది.
కానీ ఆమె విడుదలకి కేసీఆర్ బీజేపీతో ‘డీల్’ కుదుర్చుకున్నారనే ఊహాగానాలు నిజమే అయితే ప్రస్తుతం బీజేపీకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి లేదు. పైగా కేంద్రం, బీజేపీలతో మరింత జాగ్రత్తగా మెసులుకోవలసి ఉంటుంది. అప్రూవర్లపై ప్రతాపం చూపితే బెయిల్ షరతులు ఉల్లంఘించిన్నట్లవుతుంది. కనుక అటువంటి పొరపాటు చేయకపోవచ్చు. కనుక ఆమె ఎవరెవరికి వడ్డీతో సహ చెల్లించాలనుకుంటున్నారు?అనేది భవిష్యత్‌లో మెల్లగా బయటపడవచ్చు.
ఏది ఏమైనప్పటికీ, ఆమె జైలు నుంచి బయటకు వచ్చేశారు కనుక కేసీఆర్ మళ్ళీ తెలంగాణలో రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం దాంతో రాజకీయాలు మళ్ళీ వేడెక్కడం ఖాయం.
కవిత వార్నింగ్.
వడ్డీతో సహా చెల్లిస్తాం .. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వాళ్ళకి.. వడ్డీతో సహా! #KavithaBail pic.twitter.com/JKeMjsyfaV
— M9 NEWS (@M9News_) August 27, 2024