Kavitha KTR

కేసీఆర్ కుటుంబంలో మీడియాకెక్కిన రాజకీయ వివాదాలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయి. మొన్న టీవీ 5 కి కవిత ఇచ్చిన ఇంటర్ వ్యూ లో కేటీఆర్ పై ఆమె చేసిన పరోక్ష విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యక్ష ఆయుధాలుగా మారాయి.

రేవంత్ vs కేసీఆర్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాన్ని కేటీఆర్, కేటీఆర్ vs రేవంత్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పుడు కేటీఆర్ కు గుర్తింపు భయం పట్టుకుందని,

Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!

తనను తన సొంత చెల్లి కవిత కూడా నాయకుడిగా గుర్తించకపోవడంతో ఆ గుర్తింపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు విసిరిన సవాల్ కు కేటీఆర్ స్పందిస్తున్నాడంటూ మంత్రి సీతక్క కేటీఆర్ టార్గెట్ గా విమర్శనాబాణాలు ఎక్కుపెట్టారు.

ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రాడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ విదేశీ పర్యటనలో మునిగి తేలతాడు, ఇక కవిత కేసుల గోల కవితది….ఇలా అన్ని రకాలుగా డెడ్ అయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెట్టడం విడ్డురంగా ఉందంటూ మండిపడ్డారు.

Also Read – ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పవన్‌ కళ్యాణ్‌

దీనితో ఇన్నాళ్లు కాంగ్రెస్ vs బిఆర్ఎస్ నాయకుల మధ్య కొనసాగిన రాజకీయ విభేదాలు ఇప్పుడు కవిత బిఆర్ఎస్, బిఆర్ఎస్ నాయకత్వం మీద చేస్తున్న ఆరోపణలతో అవి దిశను మార్చుకునే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటి వరకు ఒక లెక్క ఇకనుంచి మరోలెక్క అన్నట్టుగా ఇక నుంచి బిఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ అస్త్రమే కాకుండా, కవిత విమర్శలు కూడా కాంగ్రెస్ నేతలకు ఆయుధాలుగా మారనున్నాయి.

Also Read – 2029: ఏపీ vs వైసీపీ..?


కేసీఆర్ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడానికి అధికార పక్షానికి అవసరమైన ఆహారాన్ని కవిత తన లేఖలతో, తన ఇంటర్ వ్యూలతో అందించారు.