పార్టీ ఒక్కటే కానీ నిఘా నేత్రాలు రెండు..?

Kavitha Takes On BRS Leadership Openly

బిఆర్ఎస్ పార్టీలో కవిత రచ్చ నా నాటికీ దాని పరిధిని పెంచుకుంటూ పోతుంది. కేసీఆర్ కు లేఖ అంటూ బిఆర్ఎస్ లో మొదలైన కవిత తిరుగుబాటు, టీవీ 5 లో ఇంటర్ వ్యూ వరకు వెళ్ళింది.

ఇక నాడు కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ మొదలైన కవిత విమర్శనా బాణాలు నేడు బిఆర్ఎస్ పెద్ద నాయకులకు హెచ్చరికలు పంపే స్థాయికి చేరుకున్నాయి. ఇక నాడు బిఆర్ఎస్ నాయకత్వ మార్పు మీద స్పందించిన కవిత నేడు జాగృతి విస్తరణ మీద ద్రుష్టి సారించారు.

ADVERTISEMENT

ఇక బనకచర్ల నుంచి బీసీ ల రిజర్వేషన్ వరకు, బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం నుంచి జాగృతి కార్యాలయ ఒపింగ్ వరకు కవిత ప్రభుత్వం తో పోరాటానికి సిద్దమయ్యింది, ప్రతిపక్ష బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారే ప్రయత్నాలు సాగిస్తుంది.

ఇందులో భాగంగా 42 % బీసీ రిజర్వేషన్ల మీద ధర్నా చౌక్ లో 72 గంటల నిరాహారదీక్ష చేపట్టిన కవిత ఇది బీసీ హక్కుల పోరాటమంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పై కదం తొక్కుతున్నారు. అయితే ఇదంతా కవిత రాజకీయానికి ఒక కోణం మాత్రమే.

నాణానికి రెండో వైపు ఉన్నట్టు కవిత రాజకీయానికి కూడా రెండో కోణం కనిపిస్తుంది. అదే బిఆర్ఎస్ పై పరోక్ష పోరు. ఈ కోణం పై కూడా కవిత బహిరంగా వ్యాఖ్యానిస్తున్నారు, అలాగే పార్టీ నాయకుల నుంచి పార్టీ పెద్దల వరకు అందరి పైన పరోక్షంగా, ప్రత్యక్షంగా సమయానుకూలంగా, సందర్భాను సారంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

మొన్నఈమధ్య కవిత పై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆ పై రాజకీయ పార్టీలు స్పందించిన తీరు తెలంగాణ రాజకీయాలకు అద్దం పట్టాయి. ఈ వ్యాఖ్యల పై ప్రత్యర్థి పార్టీ నేతలైన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు స్పందిస్తూ తీన్మార్ వ్యాఖ్యలను ఖండించారు, కవితకు మద్దతు తెలిపారు.

అయితే సొంత పార్టీ అయిన బిఆర్ఎస్ నుంచి తన సొంత కుటుంబం అయినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల నుంచి మల్లన్న పై ఎటువంటి ప్రతిదాడి జరగలేదు, అలాగే కవిత కు ఎటువంటి మద్దతు దక్కలేదు. తాజాగా ఈ అంశం ను లేవనెత్తుతూ కవిత బిఆర్ఎస్ బడా నాయకుల మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

తీన్మార్ మల్లన్న దుస్సాహసం వెనుక బిఆర్ఎస్ పార్టీలోని పెద్ద నాయకుల హస్తం ఉందని అందుకు తన దగ్గర నిర్దిష్ట సమాచారం ఉందని, ఆ కుట్రలు చేసిన బిఆర్ఎస్ పెద్ద నాయకులు నా దగ్గర పదిమందిని పెట్టి ఎప్పటికపుడు ఇక్కడ జరుగుతున్న సమాచారాన్ని సేకరిస్తున్నారు…

అయితే ఆ పెద్ద మనుషులకు తెలియని మరో అంశం ఏమిటంటే అక్కడ జరిగే కార్యక్రమాలు, ఏ నాయకుడు ఎప్పుడు ఎవరిని కలుస్తున్నారు వంటి కీలక సమాచారం సైతం ఎప్పటికప్పుడు తనకు చేరుతుంది అనే అంశం.

అంటే పార్టీ ఒక్కటే అయినా నిఘా నేత్రాలు మాత్రం బిఆర్ఎస్, జాగృతి అంటూ రెండుగా చీలిపోయాయన్నమాట. కవిత జాగృతి మీద బిఆర్ఎస్ బడా నాయకుల నిఘా పెడితే కవిత బిఆర్ఎస్ వ్యవహారాల మీద, అక్కడి నాయకుల కదలికల మీద కన్నేశారన్నమాట.

ADVERTISEMENT
Latest Stories