రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్!

KCR bumper offer to telangana farmersతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రేపు రాత్రి నుంచి తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ప్రయోగాత్మకంగా అమలుచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రైతులను టార్గెట్ చేస్తూ ఇటీవలే కేసీఆర్ అనౌన్స్ చేసిన రెండవ స్కీం ఇది. రైతులకు రెండు పంటలకు ఎకరాకు 8000 రూపాయిలు ఎరువుల కొనుగోలు కోసం ఒక స్కీం ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. తొందర్లో ఈ స్కీం అమలు లోకి రాబోతుంది. ఈ రెండు స్కీంలతో రైతులు వచ్చే ఎన్నికల్లో గంపగుత్తుగా ఓట్లు వేసి గెలిపిస్తారని కేసీఆర్ నమ్మకం.

ADVERTISEMENT

రైతులని టార్గెట్ చేస్తూ వరుసగా స్కీంలు ప్రకటిస్తూ ఉండటంతో ముఖ్యమంత్రి ఏమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారా అని అందరి అనుమానం. దీనికి అనుగుణంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వచ్చి తన ప్రయత్నాలు తాను మొదలు పెట్టింది. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ పథకం అనౌన్స్ చేసింది.

ADVERTISEMENT
Latest Stories