
గత ఎన్నికలలో టిడిపి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులైన ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్ తదితరులు బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత నుంచే టిడిపి-బీజేపీ మద్య సంబంధాలు మెరుగుపడి చివరికి 2024 ఎన్నికలలో మళ్ళీ వాటి మద్య పొత్తు కుదిరింది. ఇప్పుడు వారు ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు తమవంతు సాయం చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు కేసీఆర్ కూడా అదేవిదంగా తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. కనుక నలుగురు బిఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పార్ధసారధి రెడ్డి, దామోదర్ రావు, సురేశ్ రెడ్డిలను బీజేపీ కోసం త్యాగం చేసేందుకు కేసీఆర్ సిద్దపడిన్నట్లు సమాచారం.
Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
అందుకు ప్రతిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోసి తాను మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కేంద్రం సాయపడాలని షరతు విధించిన్నట్లు తెలుస్తోంది. ఇదే పనిమీద ఇటీవల కేటీఆర్, హరీష్ రావులను ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో మంతనాలు చేసిన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నలుగురు బిఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరిపోతే తెర వెనుక కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించిన్నట్లే అనుకోవచ్చు.
బహుశః ఇందుకే మరో రెండు నెలల్లో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు జరుగబోతున్నాయంటూ కేసీఆర్ చెపుతున్నారేమో?
Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు
బీజేపీకి రాజ్యసభ సభ్యులు అవసరమే కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కేంద్రం కేసీఆర్‌కు సహకరిస్తుందా?తెలంగాణలో కేసీఆర్‌ని మళ్ళీ గద్దెనెక్కనిస్తే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి? కుదిరితే మోడీనే గద్దె దించాలనుకున్న కేసీఆర్‌తో దోస్తీ అవసరమా? బీజేపీ సీనియర్ నేత సంతోష్ కుమార్‌ని అరెస్ట్ చేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాలనుకున్న కేసీఆర్‌కి బీజేపీ ఎందుకు తోడ్పడాలి? కేసీఆర్‌కి సహకరించేందుకు సిద్దపడినా చంద్రబాబు నాయుడు అందుకు ఒప్పుకుంటారా?వంటి లాభనష్టాల లెక్కలు కట్టుకోకుండా కేసీఆర్‌తో బీజేపీ అధిష్టానం చేతులు కలుపుతుందనుకోలేము.