కేసీఆర్ ఫెయిల్… రేవంత్ రైజ్!

revanth-reddy-kcr


కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కింగ్‌మేకర్ అవ్వాలని కలలు కన్నారు. వీలైతే దేశ ప్రధాని అవ్వాలనుకున్నారు. కానీ ఫలితం? ఆయన చెప్పిన ఆ ‘గుణాత్మక మార్పు’ సొంత పార్టీలోనే జరిగింది! ఇంకా జరుగుతూనే ఉంది.

జాతీయ రాజకీయాలలో రాణించేందుకు కేసీఆర్‌ ఏం చేయలేదు?పార్టీ పేరు మార్చుకున్నారు. ప్రత్యేక విమానాలు వేసుకుని దేశం చుట్టేశారు. వందల కార్లతో మహారాష్ట్రలో దండయాత్ర చేశారు. బహిరంగ సభలు పెట్టారు.

ADVERTISEMENT

ఎప్పుడో దివంగతులైన నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలు ప్రధాని మోడీ వరకు అందరినీ తిట్టిపోసేవారు. వందల కోట్లు ఖర్చు చేశారు. కానీ చివరికి ఏమైంది?

ఒకే ఒక్క ఎన్నికతో అంతా కూలిపోయింది. దేశాన్ని జయించాలనుకున్న కేసీఆర్‌ను సొంత గడ్డపైనే సొంత ప్రజలే ఓడించారు. గద్దె దించేశారు. అప్పటి నుంచి అసెంబ్లీకి రావడానికి మొహం చెల్లక ఫామ్‌హౌస్‌లోనే కాలక్షేపం చేస్తున్నారు.

ఫామ్‌హౌసు రాజకీయాలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకున్నారు. అది కుదరకపోగా పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కేసుల భయం, పార్టీలో, కుటుంబంలో అంతర్గత కలహాలతో కేసీఆర్‌ నలిగిపోతున్నారు.

మోడీని గద్దె దించి బీజేపిని బంగాళాఖాతంలో విసిరేయాలనుకున్నారు. ఆ కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలాలనుకున్నారు. కానీ అదే బీజేపీ తలుపులు తట్టారు. ఇది తెలిసి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు షాక్ అవ్వకుండా ఉంటారా?

ఇదే సమయంలో మొదటిసారిగా సిఎం పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి, కేవలం ఏడాదిలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు.

ఒక్క బీసీ రిజర్వేషన్ అంశంతోనే ఢిల్లీని షేక్ చేశారు. ఇంతకాలం అధిష్టానం చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగితే ఇప్పుడు అధిష్టానమే ఆయన చుట్టూ తిరుగుతోంది.

జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ హైకమాండ్, ఇండియా బ్లాక్ నేతలు అందరూ హాజరు!

పైగా బీసీల కోసం పోరాడుతున్న నాయకుడుగా సిఎం రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసినా జాతీయ రాజకీయాల్లో జీరోగా మిగిలిపోయారు. సిఎం రేవంత్ రెడ్డి ఈ ఒకే ఒక్క అంశంతో జాతీయ స్థాయి నాయకుడుగా గుర్తింపు పొందుతున్నారు.

కేసీఆర్‌ పతనానికి అహం కారణం కాగా, అందరినీ కలుపుకుపోయే గుణం రేవంత్ రెడ్డి రైజ్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆ అహంభావంతోనే కేసీఆర్‌ దేశంలో అన్ని పార్టీల నాయకులు తన నాయకత్వాన్ని అంగీకరింఛి తన వెనక నడవాలనుకున్నారు. కానీ చివరికి ఫామ్‌హౌసులో ఒంటరిగా మిగిలిపోయారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానానికి విధేయంగా ఉంటూనే అందరినీ కలుపుకుపోతూ ఈ స్థాయికి ఎదిగారు.

కేసీఆర్‌ అందరితో పేచీలు పెట్టుకుంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కీచులాడుకుంటున్న నాయకుల మద్య కూడా సఖ్యత సాధించి, తాను గెలిచి, వారినీ గెలిపించుకొని, పార్టీని గెలిపించుకున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories