ఒకే బాటలో గురుశిష్యులు… ఎవరు కాదంటారు?

KCR Jagan

రాజకీయాలలో కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు విచిత్రాలు జరుగుతుంటాయి. తమకు తిరిగే లేదనుకున్న కెసిఆర్, జగన్ ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఎన్నికలలో ఓడిపోవడం కూడా అటువంటిదే.

వారు ఓడిపోవడానికి ఇంచుమించు ఒకే రకమైన కారణాలు ఉండటం ఆశ్చర్యం అనుకుంటే, ఓడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ ఒకే రకంగా నీచ రాజకీయాలు చేస్తుండడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

రేవంత్ రెడ్డి గతంలో ఎన్నడు మంత్రిగా కూడా చేయలేదు. కానీ తొలిసారే నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ పదవి చేపట్టడానికి ఆయన ఎంతగా శ్రమించారో, ఎంతగా పోరాడారో అందరికీ తెలుసు.

పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి గురించి అందరికీ తెలుసు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే, రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్‌కి ఎక్కువ రాజకీయ, పరిపాలన అనుభవం ఉంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడంలో తడబడుతున్నారు.

కెసిఆర్ పదేళ్లలో అమలు చేయని హామీలు అనేక ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి ఏడు నెలల్లోనే కొన్ని హామీలను అమలు చేసి చూపిస్తున్నారు. అయినా కేసీఆర్‌ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప పార్టీని కాపాడుకోలేకపోతున్నారు.

తెలంగాణకు పూర్తి భిన్నమైన రాజకీయ బలాబలాలు ఏపీలో ఉన్నాయి. ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడుకి చాలా రాజకీయ పరిపాలన అనుభవం ఉంది. అందువల్లే కేవలం నెల రోజుల పాలనలోనే తన మార్క్ చూపిస్తూ అందరి ప్రశంశలు అందుకుంటున్నారు. ఆయనతో జగన్మోహన్ రెడ్డి ఏవిధంగాను సరితూగలేరు.

కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చం కేసీఆర్‌లాగే వ్యవహరిస్తూ తన సొంత మీడియా, సోషల్ మీడియాతో చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారు. కేసీఆర్‌లాగే తన పరిస్థితి, తన పార్టీ పరిస్థితి గ్రహించకుండా నీచ రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇన్నేళ్ళ రాజకీయాలలో నలిగిన తర్వాత కూడా ఇద్దరూ ఇంకా ఇలాగే ప్రవర్తిస్తుండటం ఆశ్చరమే కదా?

ADVERTISEMENT
Latest Stories