kcr-kavitha-ktr-supreme-court

కేసీఆర్‌ కుటుంబంలో ఎవరూ లా చదవలేదు కానీ అందరూ మంచి మాటకారులే. ఆ మాటకారితనానికి కేసీఆర్‌ రాజకీయ చాణక్యం కూడా తోడవడంతో అతి తక్కువ కాలంలోనే గొప్ప నాయకులుగా ఎదగగలిగారు. కానీ ఆ మాటకరితనంతో ఎన్నికలలో గెలవలేక బోర్లా పడ్డారు. కానీ సహజంగా అబ్బిన మాటకారితనం వారిలో అలాగే ఉంది.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

ఎఫ్-1 రేసింగ్ కేసులో గురువారం సాయంత్రం ఈడీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్‌ మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ఇది అర్దమవుతుంది.

“గతంలో రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసులున్నందున, ఆ కక్షతో ఇప్పుడు నాపై కూడా ఏసీబీ, ఈడీ కేసులు పెట్టించారు తప్ప నేను ఏ తప్పు చేయలేదు. ఏసీబీ, ఈడీలకు ఇదే చెప్పాను. నన్ను ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వచ్చి వారు అడిగే ప్రశ్నలన్నీటికీ సమాధానాలు చెపుతాను,” అన్నారు.

Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!

ఎఫ్-1 కేసులో నిబందనలకు విరుద్దంగా విదేశీ సంస్థలకు నగదు బదిలీ చేయడం ఆర్ధిక నేరమని ఈడీ కేటీఆర్‌ మీద ‘మనీ లాండరింగ్ కేసు’ నమోదు చేస్తే, గతంలో కేసీఆర్‌ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించి జైలుకి పంపినందునే, ఆ కక్షతో ఇప్పుడు ఈ తప్పుడు కేసులో తనని ఇరికించారని కేటీఆర్‌ చెప్పడం మాటకారితనం, అతి తెలివే కదా?

“నన్ను విచారణకు పిలిపించినపుడల్లా పోలీస్ బందోబస్తుకు ప్రభుత్వానికి రూ.5-10 కోట్లు ఖర్చవుతోంది. కనుక నేను రేవంత్ రెడ్డికి మంచి ఆఫర్ ఇస్తున్నాను. హైకోర్టు న్యాయమూర్తి ఎదుట మీడియా సమక్షంలో ఇద్దరం ‘లై డిటెక్టర్లు’ పెట్టుకొని ఈ కేసుల గురించి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుదాం.

Also Read – ఆప్ ఓటమికి బిఆర్ఎస్ స్కాములే కారణమా..?

ఇలా అయితే తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో దొంగలు ఎవరో తేలిపోతుంది. నాతో చర్చకు కూర్చొనే దమ్ముందా?”అని కేటీఆర్‌ రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.

కేసులు ఇంత సులువుగా పరిష్కరించేయగలిగినప్పుడు ఇక ఈ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, విచారణలు దేనికి?అందరూ ఇలాగే బహిరంగ చర్చలు పెట్టేసుకొని ఎవరి వాదనలు వారు వినిపించేసి ఎవరికి వారు తీర్పులు చెప్పేసుకోవచ్చు కదా?

ఇదివరకు లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితని అరెస్ట్‌ చేసినప్పుడు, తన కేసును తానే కోర్టులో వాదించుకోవడానికి సిద్దపడ్డారు. తాను తప్పు చేయలేదని తన మాటకారితనంతో న్యాయమూర్తిని ఒప్పించేయగలనని ఆమె అనుకున్నారు. కానీ న్యాయమూర్తి అనుమతించలేదు. అంటే కేసీఆర్‌ కుటుంబంలో ప్రతీ ఒక్కరూ మాటకారితనంతో తిమ్మిని బమ్మిని చేసి నెగ్గుకు రాగలమని గట్టి నమ్మకంతో ఉన్నారని అర్దమవుతోంది.

కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చేయాలని చెపితే, ఆయన కొడుకు కేటీఆర్‌ తనకు కోర్టులపై అపారమైన గౌరవం, నమ్మకం ఉందంటూనే తనకు నచ్చిన్నట్లు ఈవిదంగా ఈ కేసు విచారణ జరగాలని సూచిస్తున్నారు!




తమ మాటకారితనంతో ప్రజలను ఏమార్చగలమే కానీ న్యాయవ్యవస్థని ఏమార్చలేమని కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. అయినా వారు ఈవిదంగా అతితెలివి ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నారంటే, అవినీతి కేసులలో అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళ్ళినా ప్రజల సానుభూతి పొందేందుకు, ఆ సానుభూతిని రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ధి పొందేందుకే అని చెప్పక తప్పదు.