KCR KTR

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రి అవ్వాలనుకున్నారు. కనుక దేశ ప్రజలను, దేశంలో ప్రతిపక్ష పార్టీల దృష్టిని ఆకర్షించేందుకు ప్రధాని మోడీపై కత్తులు దూస్తుండేవారు.

తద్వారా రాజకీయాలలో తనది ప్రధాన మంత్రి స్థాయి అని ప్రజలను నమ్మించాలనుకున్నారు. కానీ తనకు తిరుగు లేదనుకున్న తెలంగాణలోనే ఓడిపోవడంతో, రాష్ట్ర రాజకీయాలలో కూడా ధైర్యంగా పాల్గొనలేక ఫామ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తున్నారు.

Also Read – పేర్ని అత్యుత్సహం: అరవడానికా.? కరవడానికా.?

కనుక ఇప్పుడు పార్టీ పగ్గాలు ఆయన కుమారుడు కేటీఆర్‌ చేతిలోకి వచ్చాయి. కేటీఆర్‌ కూడా తండ్రి అడుగుజాడలలో నడుస్తూ రాష్ట్ర రాజకీయాలలో తనది ముఖ్యమంత్రి స్థాయి అని నిరూపించుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డిపై కత్తులు దూస్తున్నారు.

ఆ ప్రయత్నంలో సభ్యత హద్దులు మరిచి ముఖ్యమంత్రిని వాడు వీడు, చిల్లరగాడు, దొంగ అంటూ నోటికి మాట్లాడుతూ తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారు.

Also Read – జగన్‌ మెప్పుకంటే శతృత్వమే మేలు?

కేటీఆర్‌ తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నారు కనుక తనది ముఖ్యమంత్రి స్థాయి అని భావిస్తూ ఆ విదంగా మాట్లాడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు గ్రహించారు.

అందుకే వారు కూడా “నువ్వు, హరీష్ రావు ఇద్దరు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే. ఏ అంశంపైనైనా ముఖ్యమంత్రితో వాదించాలంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభకు వచ్చి వాదించవచ్చు. ఆయనకు సిఎం రేవంత్ రెడ్డి సమాధానాలు చెపుతారు,” అంటూ కేటీఆర్‌కి ఆయన స్థాయిని గుర్తుచేశారు. అలాగే శాసనసభకు రా(లే)ని కేసీఆర్‌ నిసహాయతని కాంగ్రెస్‌ మంత్రులు తెలివిగా వాడుకొని కేటీఆర్‌ని ఇరుకున పెట్టారు.

Also Read – షర్మిల – కవిత ప్యారలల్ యూనివర్స్ లో ఉన్నారా.?

కేటీఆర్‌ కూడా ఈ విషయం బాగానే క్యాచ్ చేశారు. అందుకే “సిఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమక్షంలో తనతో చర్చకు రావాలని” కేటీఆర్‌ సవాలు విసిరారు. ఓపక్క వారు “నువ్వు కేవలం ఎమ్మెల్యేవి మాత్రమే,” అని చెపుతుంటే, ముఖ్యమంత్రి తనతో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్‌ సవాలు విసరడం హాస్యాస్పదంగా ఉంది. కానీ తనది ముఖ్యమంత్రి స్థాయి అని నిరూపించుకునేందుకే కేటీఆర్‌ పడుతున్న తాపత్రయమే అది.

గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఇలాగే సవాళ్ళు విసిరారు. అప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిది తన స్థాయి కాదని భావించడం వల్లనే!

ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌ది తన స్థాయి కాదని చెపుతున్నారు కదా?కనుక బహిరంగ చర్చకు వచ్చి కేటీఆర్‌ స్థాయి పెంచాలని సిఎం రేవంత్ రెడ్డి కోరుకోరు కదా?అందుకే కేసీఆర్‌ని శాసనసభకు రమ్మంటున్నారు. వెళ్ళొచ్చు కదా?