కేసీఆర్ వద్ద ప్రతి సమస్యకు సమాధానం!

KCR on 2019 elections సహజంగా ప్రభుత్వంలో ఉన్నవారి పై కొంత వ్యతిరేకత ఉండడం సహజం. ఆది ఎంత అనే దనిబట్టి ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తదా రాదా అనేది డిసైడ్ అవుతుంది. ఈ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చడం ఒక పద్దతి. ఐతే కేసీఆర్ కు ప్రభుత్వ వ్యతిరేకత భయం లేదట.

ADVERTISEMENT

వచ్చే జనరల్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి 96 నుంచి 104 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 99శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. కాబట్టి ఆ గొడవ వదిలేసి నియోజకవర్గ అభివృద్ది మీద దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

99శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇస్తే వేరే పార్టీ నుండి తెచ్చుకున్న వారిని ఏంచేస్తారు అనే ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రి వద్ద సమాధానం ఉంది. అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని, గుజరాత్‌ ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు. కేసీఆర్ వద్ద ప్రతి సమస్యకు సమాధానం ఉన్నట్టు ఉంది.

ADVERTISEMENT
Latest Stories