
కేసీఆర్ వాస్తు, జాతకాలు, గ్రహాలు, యజ్ఞయాగాలు అన్నీ నమ్ముతారు… పాటిస్తారు… వేణుస్వామిలా ఎవరు అడగకపోయినా ఉచితంగా చెపుతుంటారు కూడా.
Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 119కి 100కిపైగా సీట్లు అని జోస్యం చెప్పారు. కానీ 39 మాత్రమే వచ్చాయి. లోక్‌సభ ఎన్నికలలో 17కి 12 సీట్లు పైనే గెలుచుకుంటామని కేసీఆర్ చెప్పారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీకి ఒక్క సీటు గెలిస్తే గెలవచ్చని లేకుంటే అదీ దక్కకపోవచ్చని (వన్ ఆర్ నన్) అని చిలక జోస్యం చెప్పారు. కానీ అదీ ఫలించలేదు.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
అక్కడ తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ 8, బీజేపీ 8, మజ్లీస్ 1 సీటు గెలుచుకోబోతుంటే, బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం కనబడటం లేదు. అంటే ఆయన చెప్పిన ‘వన్ ఆర్ నన్’ బిఆర్ఎస్ పార్టీకే తగిలిందన్న మాట. ఇక్కడ ఏపీలో బీజేపీ ఈసారి 7-8 శాసనసభ, 3 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోంది.
ఈసారి కేంద్రం ఎన్డీయేకి 200, ఇండియా కూటమికి 100-120 సీట్లు మాత్రమే వస్తాయని, అప్పుడు ‘నేనే చక్రం తిప్పక తప్పేలా లేదని’ కేసీఆర్ చెప్పారు. కానీ ఈసారి ఎన్డీయే కూటమి సుమారు 300 సీట్లతో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
కాంగ్రెస్‌కు 100-120 మాత్రమే అని కేసీఆర్ చెపితే దానికి ఈసారి 190 వరకు సీట్లు గెలుచుకోబోతోంది. తద్వారా లోక్‌సభలో దాని బలం ఇంకా పెరుగుతోంది.
అంటే కేసీఆర్ జోస్యం సొంత పార్టీ విషయంలోనే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీజేపీ విషయంలో కూడా ఫలించలేదన్న మాట!
కేసీఆర్‌కి తన భవిష్యత్, తన పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోలేనప్పుడు ఇతర రాష్ట్రాలు, పార్టీలకు జోస్యం చెప్పడం అవసరమా? ఊళ్ళో అందరికీ శకునం చెప్పిన బల్లి చివరికి కుడితిలో పడి చచ్చిందన్నట్లు, లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేద్దామని పగటికలలు కంటున్న కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేదా? అనే అనుమానం కలుగుతుంది. రేపటి నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీలకు క్యూకట్టడం మొదలుపెట్టాక ప్రెస్‌మీట్ పెట్టి…. దేశంలో, తెలంగాణ రాజకీయాలలో నైతిక విలువలు నశించిపోతున్నాయని చెపుతారేమో?