విశాఖపట్నంకు వచ్చి కేసీఆర్ ఏం చెయ్యబోతున్నారు?

KCR- TRS Party - Vizagతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నిమిత్తం ఐదు రోజుల పర్యటనకు వెళ్ళబోతున్నారు. మొదటిగా ఆయన విశాఖపట్నం వెళ్ళబోతున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెడతాం, చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని కేసీఆర్ చెప్పిన దరిమిలా ఆయన పర్యటన ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక్కడ ఆయన ఎవరినైనా కలవబోతున్నారా అనేది తెలియలేదు. విశాఖపట్నం పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతున్న సంగతి తెలిసిందే.

[m9ad]

ADVERTISEMENT

అటునుండి కేసీఆర్ భువనేశ్వర్ వెళ్ళి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలవబోతున్నారు. గతంలో ఒకసారి కేసీఆర్ ఆయనను కలవాల్సి ఉండగా చివరి నిముషంలో ఆ పర్యాటన వాయిదా పడింది. నవీన్ పట్నాయక్ ను కలిశాక ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్ళి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తారు. ఇప్పటికే కేసీఆర్ ఆమెను ఒకసారి కలవడం జరిగింది. కాంగ్రెస్సేతర బీజేపీయేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తా అంటున్న కేసీఆర్ ఈ పర్యటనలో ప్రధానమంత్రి కేసీఆర్ ను కూడా కలవబోతున్నట్టు సమాచారం.

రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ప్రధానిని కలవడం ఇదే మొదటి సారి. మూడు రోజుల పాటు ఆయన దేశ రాజధానిలో మఖామ్ వెయ్యబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు కేసీఆర్ పూర్తి స్థాయిలో కేబినెట్ ను కూడా ఏర్పాటు చెయ్యలేదు. 23 నుండి 28 వరకు ఈ పర్యటన సాగుతుంది. తిరిగి వచ్చిన తరువాతే ఆయన కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే కొంత మేర కసరత్తు చేసిన కేసీఆర్ తన పర్యటనలో కూడా దానిపై ఆలోచన చేస్తారట.

ADVERTISEMENT
Latest Stories