లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్.పిలు పార్లమెంటులో చర్చలో పాల్గొనలేదు. తాము బిల్లును సమర్దించడం లేదని,అలాగని వ్యతిరేకించడం లేదని వారు చెబుతున్నారు. బిల్లును సమర్దించాలని బీజేపీ టిఆర్ఎస్ ను కోరింది.
కాని అందుకు టిఆర్ఎస్ సిద్దపడలేదు. అలాగని బిజెపి నాయకత్వానికి అసంతృప్తి కలిగించడం ఇష్టం లేక, అంతేకాక అదే సమయంలో బిల్లుకు సమర్దిస్తే మిత్ర పక్షంగా ఉన్నమజ్లిస్ కు అసంతృఫ్తి వస్తుందని కాబట్టి ఆ సమయంలో సభలో లేకుండా జాగ్రత్త పడ్డారట. ఒకపక్క బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తూ మజ్లీస్ తో దోస్తీ కట్టడం ఒక్క తెరాసకే చెల్లింది.
కేంద్రంలో తమ వ్యూహం ఏంటో స్పష్టంగా లేనందున భవిష్యత్తులో ఎలాంటి రాజకీయం జరుగుతుందో తెలియదు కనుక ఇలా చెయ్యడం ద్వారా అన్ని అవకాశాలను ఓపెన్ గా ఉంచుకోవాలని భావించారట. అయితే ఇలా కేసీఆర్ రెండు పడవల ప్రయాణం ఎన్నాళ్లు చెయ్యగలరు? అనేది అసలు ప్రశ్న.



