
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఇద్దరూ రాజకీయ మేధావులే. కానీ కేసీఆర్‌కి ప్రగల్భాలు, అహంకారం ఎక్కువ. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడరు.
Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!
చంద్రబాబు నాయుడుకి ఈ రెండు దుర్లక్షణాలు లేవు. చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు సిగ్గుపడరు. కేసీఆర్‌లా కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలుకలేదు. కానీ తిప్పుతున్నారు.
కేసీఆర్ ధోరణి వలన బిఆర్ఎస్ పార్టీ నష్టపోతుంటే, చంద్రబాబు నాయుడు వైఖరి వలన టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడి రాజకీయ వైఖరి లేదా వ్యూహాలు కేసీఆర్ కంటే మెరుగైనవని స్పష్టమవుతోంది కదా?
Also Read – సనాతన మార్గంలో పవన్ ప్రయాణం తమిళనాడుకే
ఒకప్పుడు చంద్రబాబు నాయుడుని ఎంతగానో ఈసడించుకున్న కేసీఆర్‌కి ఇప్పుడు ఆయన ఈ స్థాయికి ఎదగడం, ఇదే సమయంలో తాను, తన పార్టీ ఇంత దయనీయస్థితిలో ఉండటం జీర్ణించుకోవడం కష్టమే.. కానీ తప్పదు.
ఈ లోకంలో తానే గొప్ప రాజకీయ మేధావినని భావించే కేసీఆర్‌కి చంద్రబాబు నాయుడి రాజకీయ చాణక్యం చూసిన తర్వాత లోలోన భయం మొదలైన్నట్లే ఉంది. అందుకే ఎన్డీఏ కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో మళ్ళీ అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు హుకుం జారీ చేశారు.
Also Read – కొత్త జట్టుకు పాత గుర్తులు ఇవ్వగలడా..?
చంద్రబాబు నాయుడు అంటే లోలోన భయపడుతున్నప్పటికీ, ఆయనని బూచిగా చూపిస్తేనే ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించవచ్చని కేసీఆర్ భావిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అలనాడు భక్త ప్రహ్లాదుడు భక్తితో, అతని తండ్రి హిరణ్య కశిపుడు ద్వేషంతో శ్రీమన్నారాయణుని స్మరిస్తూ మోక్షం పొందారు. కనుక కేసీఆర్ కూడా భయంతోనో, ద్వేషంతోనో చంద్రబాబు నాయుడుని ఇంకా వాడేసుకుంటూ, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని తాపత్రయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని, పోలవరం నిర్మించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తాపిస్తున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకొనప్పటికీ, ఆయన పేరుతో కేసీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంతోషించాలా?నవ్వుకోవాలా?