
ఇప్పుడు జగన్, కేసీఆర్ ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇద్దరి పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంది. కానీ జగన్‌తో పోలిస్తే కేసీఆర్‌కి కొన్ని కలిసి వచ్చే అంశాలున్నాయి.
బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి బలమైన ‘తెలంగాణ సెంటిమెంట్’ అస్త్రం ఉంది. కేసీఆర్ దానిని ఎప్పుడు కావాలంటే అప్పుడు విరివిగా ఉపయోగించుకుంటారు.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
“చంద్రబాబు నాయుడు కృష్ణా, గోదావరి నీళ్ళని దోచుకుపోతున్నారంటూ” హరీష్ రావు పాట మొదలుపెట్టడం దాని కోసమే.
ఏపీలో రాజధాని అమరావతి సెంటిమెంట్ ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిని గుర్తించలేకపోయారు. ఒకవేళ అమరావతి, పోలవరం నిర్మాణ పనులు కొనసాగించి, రాష్ట్రాభివృద్ధికి జగన్ కూడా కృషి చేసి ఉండి ఉంటే నేడు వాటి గురించి గట్టిగా మాట్లాడేందుకు జగన్‌కి హక్కు, అవకాశం ఉండేది. కానీ అదీ లేకుండా పోయింది.
Also Read – రచ్చ గెలిచేసాడు.. మరి ఇంట..?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపిపై కత్తులు దూసినప్పటికీ, ఓడిపోయిన తర్వాత బీజేపితో లోపాయికారి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. బీజేపికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు. కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు కేసీఆర్‌తో తెర వెనుక చేతులు కలిపేందుకు సిద్దపడవచ్చు.
కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపి భాగస్వామిగా ఉంది. అక్కడ ఢిల్లీలో ఎన్డీయే కూటమిలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. కనుక జగన్‌కి బీజేపి సాయం లభించే అవకాశం లేదు. పైగా ఇదే కారణంగా ఆక్రమస్థుల కేసులలో కదలికలు మొదలైతే జగన్ జైలుకి వెళ్ళాల్సి రావచ్చు.
Also Read – 17 ఏళ్ళ పోరు…ప్రతీకారం తీర్చుకుంటారా.?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి పాలనలో అనుభవం లేకపోవడం వలన నేటికీ తప్పటడుగులు వేసి కేసీఆర్‌కి దొరికిపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, వైఫ్యల్యాలను బిఆర్ఎస్ పార్టీ తెలివిగా అందిపుచ్చుకొని దూసుకుపోతోంది.
కానీ జగన్ ముఖ్యమంత్రిగా విఫలం కాగా, చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. పైగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారు.
కనుక కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడానికి జగన్‌కి బలమైన కారణాలు ఏవీ దొరకడం లేదు. అందుకే సంక్షేమ పధకాలు, హామీల అమలు, వైసీపీ నేతలపై కేసుల గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు.
కేసీఆర్‌కి కొండంత అండగా కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్నారు. కానీ జగన్ అధికారంలోకి రాగానే తల్లీ చెల్లీ అవసరం లేదని తరిమేసి ఒంటరివారయ్యారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయులైన విజయసాయి రెడ్డి వంటివారూ బయటకు వెళ్ళిపోయారు. పార్టీలో మిగిలిన నేతలలో చాలా మందిపై అవినీతి, దౌర్జన్యాలు, భూకబ్జాల కేసులున్నాయి. కనుక ఎవరూ ధైర్యంగా వైసీపీ కోసం పోరాడలేరు.
కనుక కేసీఆర్‌తో పోలిస్తే జగన్‌కు రాజకీయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితిలో జగన్ పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకుంటూ, కూటమి ప్రభుత్వంపై రాజకీయంగా పైచేయి సాధించడానికి చాలా చమటోడ్చాల్సి ఉంటుంది.
కానీ పరామర్శలకు తప్ప ప్యాలస్ వదిలి బయటకు రావడానికి జగన్ ఇష్టపడటం లేదు. కనుక వైసీపీ బ్రతికి బట్ట కట్టాలంటే కనీసం జగన్ తీరు, నోరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.