తూచ్! రాజేష్ నిందితుడు కాదు: ఏపీ సీఐడీ

Kilaru-Rjesh

ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వానికి లోబడే అన్ని వ్యవస్థలు పనిచేయాలి కానీ నిష్పక్షపాతంగా పని చేయాలి. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడుపుతోందనే దానితో సంబందం లేకుండా అధికారులు నిర్భయంగా, నిష్పక్షపాతంగా పనిచేయగలిగినప్పుడు అన్నీ సవ్యంగా సాగుతుంటాయి.

కానీ ఆంధ్రాలో దాదాపు అన్ని వ్యవస్థలు ప్రభుత్వం కోసం కాక అధికారంలో ఉన్న వైసీపి కోసమే పనిచేస్తుండటంతో ప్రతిపక్షాలకు, ప్రజలకు, సంబందిత అధికారులు, ఉద్యోగులకు కూడా సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.

ADVERTISEMENT

ఉదాహరణకు టిడిపి కార్యదర్శి కిలారు రాజేష్ వ్యవహారంలో ఏపీ సీఐడీ ప్రదర్శించిన అత్యుత్సాహం గురించి చెప్పుకోవచ్చు.

ఆ కేసులో ఆయన సాక్షి మాత్రమే అని కానీ ‘పొరపాటున’ నిందితుడుగా పేర్కొన్నామని ఏపీ సీఐడీ హైకోర్టులో ఒప్పుకొంది. ఆయన నిందితుడు కానప్పటికీ ‘లుకవుట్ నోటీస్’ కూడా జారీ చేసింది. ఆయన నిందితుడు కానప్పటికీ హైదరాబాద్‌లో ఆయన బయట తిరుగుతున్నప్పుడు ఏపీ ఇంటలిజన్స్ విభాగానికి చెందిన పోలీసులు ఆయనను వెంబడిస్తున్నారు.

కిలారి రాజేష్ శుక్రవారం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేసి ఈ విషయాలన్నిటినీ న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళడంతో ఏపీ సీఐడీ తప్పు ఒప్పుకోక తప్పలేదు. పొరపాటున ఆయన పేరును నిందితుడుగా చేర్చామని వెంటనే వెబ్‌సైట్‌లో నుంచి తొలగిస్తున్నామని హైకోర్టుకి తెలియజేసింది.

ఓ కేసులో సాక్షిగా పేర్కొన్న వ్యక్తిని నిందితుడుగా మార్చడం పొరపాటా? లుకవుట్ నోటీస్ జారీ చేయడం కూడా పొరపాటేనా? ఏపీ ఇంటలిజన్స్ పోలీసులు పొరుగు రాష్ట్రంలో ఓ వ్యక్తిని వెంబడించడం కూడా పొరపాటేనా?అంటే కాదనే అర్దమవుతోంది.

రాజేష్ నిందితుడు కాదని సాక్షి అని ఏపీ సీఐడీకి తెలిసి ఉన్నప్పటికీ ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తోంది? అంటే అధికార వైసీపీ అభీష్టం మేరకు నడుచుకోవాలనే తాపత్రయమే అని అర్దమవుతోంది. కానీ వైసీపికి బదులు దాని కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులే హైకోర్టులో మొట్టికాయలు తింటున్నారు కదా?

వైసీపి, టిడిపి రెండు రాజకీయ పార్టీలు. రాజకీయంగా వాటి మద్య శతృత్వం ఉంది కనుక అధికారంలో ఉన్న వైసీపి టిడిపిని తుడిచిపెట్టేయాలనుకోవడం సహజమే. కానీ వాటి రాజకీయ పోరాటంలో అధికారులు తలదూరిస్తే చివరికి నష్టపోయేది వారే. అక్రమస్తుల కేసులలో అధికారులు కూడా జైలుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తున్నారో లేదో?

ADVERTISEMENT
Latest Stories