బీజేపీ డంపింగ్ యార్డ్ కాదంటా…

BJP Rejects Konda Surekha Rumours

అధికార కాంగ్రెస్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ ఇప్పటికి తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గానే కొనసాగుతుందనే చెప్పాలి. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయం ఉందంటూ సురేఖ రేవంత్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు.

ఈ నేపథ్యంలో సురేఖ త్వరలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి మరోపార్టీ జెండా కప్పుకోవడం ఖాయమంటూ మీడియాలో పలు వార్తా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో భాగంగానే సురేఖ గులాబీ కారెక్కబోతున్నారని, కాషాయ జెండా కప్పుకోబోతున్నారని, చివరికి తెలంగాణలోనే ఉనికే లేని వైసీపీ లో చేరుతున్నారంటూ ఇలా భిన్న కథనాలు వెలువడ్డాయి.

ADVERTISEMENT

అయితే ఈ విషయంలో టి.బీజేపీ నాయకుడు మురళీధర్ రావు తీవ్రంగా స్పందించారు. పార్టీలో చేరికల విషయంలో తమ పార్టీకి ఒక స్ఫష్టమైన విధానం ఉందని, కాంగ్రెస్ పార్టీలో ఎదురైనా అంతర్గత సంక్షోభం డైవర్ట్ చేసేందుకు ఇటువంటి వార్తలు కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మురళీధర్.

అలాగే బీజేపీ ఒక డంపింగ్ యార్డ్ కాదంటూ, ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలను రాష్ట్ర బీజేపీ స్వాగతించదు అంటూ కొండా సురేఖ బీజేపీ ఎంట్రీ వార్తలను కొట్టిపడేసారు మురళీధర్. అటు బిఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి సైతం తమ పార్టీలోకి కూడా సురేఖ ఎంట్రీ ఉండదంటూ తేల్చి చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories