ఇంకెన్నాళ్లు ఈ కులాల కొట్లాటలు…,మతాల మంటలు…?

KTR-Comments-on-Caste-Politicsప్రశాంతంగా ఉండే హైద్రాబాద్ లో ఒక్కసారిగా మతాల మధ్య విద్వేషాలతో మంటలు చెలరేగుతున్నాయి. రాజాసింగ్ అనే ఒక్క వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు గాను రెండు మతాల మధ్య అల్లర్లు మొదలయ్యాయి. మనిషి స్పేసులో నివసించే స్థాయికి టెక్నాలెజీ ని అభివృద్ధి చేసినప్పటికీ ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు మతాల మత్తులో…,కులాల కుంపట్లో ప్రజలను ఏమారుస్తూనే ఉన్నారు. ఇంతకీ ప్రజలను ఈ భ్రమలో ఉంచుతున్న తప్పు ఆయా నాయకులదా…? లేక ఆ భ్రమలను ఛేదించలేని తప్పు ప్రజలదా…? అనేది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.

దేశం వెలిగిపోతుంది అంటూ కేంద్ర పెద్దలు చేస్తున్న ఆర్భాట ప్రచారాలలో నుంచి వాస్తవానికి వచ్చి చూస్తే తెలుస్తుంది…,దేశం వెలిగిపోవడం కాదు మతాల మధ్య.., కులాల మధ్య నలిగిపోతుందని. రాష్ట్రంలో జరుగుతున్న మత ఘర్షణలను ఉద్దేశించి కేటీఆర్ ఆలోచనాత్మక వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

ఏ దేవుడు చెపుతున్నాడు నా పేరు చెప్పుకుని తన్నుకు చావండి అని…, కృష్ణుడు చెప్పాడా..? ఏసుప్రభు చెప్పాడా..? అల్లా చెప్పారా..? అంటూ వ్యాఖ్యానించారు. ఎవరిదేవుడు గొప్ప అనే పోటీ పెట్టుకుని ఒకరిని ఒకరు చంపుకొని పొమ్మనీ ఎవరు చెప్పారు మీకు..? ఎవరి అమ్మ వారికే గొప్ప… అలాగే ఎవరి మతం వారికీ గొప్పే అనే సత్యాన్ని ఒప్పుకొని తీరాలి. ఒకరి మతం పై ఒకరు ద్వేషాన్ని పెంచుకుని అల్లర్లు చేసుకుంటే చివరకు నష్టపోయేది కూడా మనమే అనే సత్యాన్ని గుర్తించాలంటూ కేటీఆర్ యువతకు బాధ్యతాయుత సందేశాన్ని ఇచ్చారు.

దేశంలో కొందరు తిండి లేక., మరికొందరు నీళ్లు లేక అల్లాడుతుంటే ఇలా తమ స్వార్ధ రాజకీయ మనుగడకు మతాల మంటలను రేపుతున్న నేతల ఉచ్చులో నేటి యువత బలికాకూడదనేదే నిస్వార్థంగా దేశాన్ని ప్రేమించే సామాన్యుడి ఆకాంక్ష. మన కులంవారు పండించే పంటనే మనం తింటున్నామా..? మన మతం పాటించే వైద్యుడినే సంప్రదిస్తున్నామా..? మన ఆచారాలు అనుసరించే ఉపాధ్యాయుల వద్దే చదువు అభ్యసిస్తున్నామా..?

వీటన్నికి చూడని మతాలు – కులాలు ఓటువేసి ముందు మాత్రమే ఆలోచించడం ఎంతవరకు సబబో ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇకనైనా బాధ్యతాయుత వ్యాఖ్యలు చేయడం రాజకీయ నేతల వంతైతే…,చేసిన వ్యాఖ్యలను రాజ్యంగబద్దంగా ఎదుర్కోవడం ప్రజల వంతవ్వాలి.

దేశ రాజకీయాలు అన్ని మతాల చుట్టూ., రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నంత కాలం ఈ వ్యవస్థలో మార్పు రాదు. కోడి ముందా..? గుడ్డు ముందా..? అన్న చందంగా రాజకీయ నాయకులు మారాలా..? ప్రజలు మారాలా..? అనే సమాధానం లేని ప్రశ్న చుట్టే ఈ రాజకీయాలు జరగడం అన్ని రాజకీయ పార్టీలకు తమ మనుగడను విస్తృత పరుచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. రాజకీయ నేతలు కూడా ఇటువంటి ప్రశ్నలకు సమాధానం శోధించాలని భావించరు.

భగవత్ గీత వింటేనో.., బైబిల్ చదివితేనో.., ఖురాన్ పఠిస్తేనో దేవుని పట్ల… మతం పట్ల… గౌరవం ఉన్నట్లు కాదు. తోటివారికి హాని చేయకుండా జీవించడం కూడా దేవుడ్ని ఆరాదించడంతో సమానమే అనే వాస్తవాన్ని అందరు గమనించాలని..,పాటించాలని ఆశిద్దాం.
అప్పుడే దేశం వెలిగిపోకపోయినా… నలిగిపోకుండా ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories