కేటీఆర్ అత్యుత్సాహం తెలుగు రాష్ట్రాలకు చేటు!

KTRతెలంగాణ ఐటీ మినిస్టర్, కేటీఆర్ ట్విట్టర్లో కొత్త వివాదానికి కేంద్రమయ్యారు. సెంటిమెంట్ కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన ఒక ట్వీట్ పై మంత్రి కెటిఆర్ కొంతమేర అతిగా స్పందించారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారని, తమ పోరాటాన్ని నీరుగార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆయన అ‍న్నారు.

ఎన్నో సార్లు ప్యాకేజీలు ఇచ్చి మభ్యపెట్టడానికి ప్రయత్నించినా, వాటికి ఆశపడకుండా, పట్టువిడవకుండా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల గురించి చంద్రబాబు పోరాడవచ్చని, అంతే కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన తెలంగాణ ప్రజలను తక్కువ చేసి మాట్లాడరాదని అన్నారు.

ADVERTISEMENT

అయితే ఇందులో విషయం ఏంటంటే – చంద్రబాబు వేసిన ట్వీట్ యధాతథంగా ఇది – “కేంద్ర మంత్రి గారు ఓ మాట అన్నారు. ‘సెంటి మెంట్‌కు డబ్బులు రావు’ అని. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే ‘తెలంగాణ’ రాష్ట్రాన్ని ఇచ్చారు.” ఇందులో తెలంగాణను కించపరచడం ఏంటో అర్ధం కాని విషయం.

తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ వల్లే రాష్ట్రం సాధ్యమైంది. అదే చంద్రబాబు కూడా చెప్పారు. దానికి కేటీఆర్ అంతగా రియాక్ట్ ఎందుకు అయ్యారో ఎవరికీ అంతుచిక్కని విషయం. ఏదోరకంగా చంద్రబాబుపై, టీడీపీపై విరుచుకుపడి తమ వారి మెప్పు పొందాలనే తాపత్రయంతో కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంధ్ర వారి వాదన.

వివాదాల్లోకి వెల్లడం ఎందుకుగానీ ఈ విషయంలో కేటీఆర్ కాస్త ఓవర్ గానే రియాక్ట్ అయ్యారు అనేది ఒప్పుకోవాల్సిందే. అయితే అత్యుత్సాహంతో చేసే ఇటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలు దెబ్బ తింటాయి. ఇప్పటికే కేటీఆర్ ట్వీట్ కు ఆంధ్ర వారినుండి ఘాటుగానే సమాధానం వస్తుంది. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సాటి తెలుగు వారిగా చేయూతనివ్వాలి గానీ ఇటువంటి అనవసర వివాదాలు ఈ సమయంలో అనవసరమే.

ADVERTISEMENT
Latest Stories