దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతిని చంద్రబాబుకు వ్యతిరేకంగా వాడుతుంది వైకాపా. చంద్రబాబు మీద ఉన్న వ్యక్తిగత కక్షతో ఎప్పుడు రగిలిపోయే లక్ష్మి పార్వతి ముఖ్యమంత్రిపై వీలైనప్పుడల్ల ఏవో ఒక ఆరోపణ చేసి వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో లక్ష్మి పార్వతి సరికొత్త ఆరోపణ చేశారు.
చంద్రబాబు గతంలో ఏ ముఖ్యమంత్రి వాడని అన్ని స్పెషల్ ఫ్లైట్లు వాడారట. హైదరాబాద్ వెళ్ళాలన్నా. హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్ళాలన్నా చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ నే వాడుతున్నారట. ఇవన్ని చూసి లక్ష్మి పార్వతికి సరికొత్త అనుమానం ఏదో వచ్చిందట. అదేంటి అంటే లోకేష్ బాబు చంద్రబాబుకి ఒక స్పెషల్ ఫ్లైట్ కొని ఇచ్చాడని ఆమె డౌట్.
పనిలో పనిగా ఆది కాదు అని నిరూపించుకునే అగత్యం కూడా తెలుగు దేశం ప్రభుత్వానిదే అని కూడా అనేశారు లక్ష్మి పార్వతి. అవునులే ఈ మధ్య రాజకీయవిమర్శలలో తర్కం ఎక్కడ ఉంటుంది? గుడ్డ కాల్చి మీద వేస్తాం మీరే మీ మీద పడిన మసి తుడుచుకోండి అనడమే రాజకీయం.


