పోలింగ్ అల్లర్ల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారా… ఇంకా లేదా?

Mukesh Kumar Meena

శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు ఎన్నికల సంఘానికి కనువిప్పు కలిగించే ఉండాలి. ఈసారి ఎన్నికలలో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని ముందే అంచనా వేసినప్పటికీ ఎన్నికల సంఘం అల్లర్లు జరుగకుండా నివారించలేకపోయింది.

ADVERTISEMENT

ఈ అల్లర్ల విషయంలో అధికార వైసీపి, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల సంఘాన్నే నిందిస్తుడటం గమనిస్తే, పోలింగ్‌ సమయంలో నిఖచ్చిగా వ్యవహరించి ఉంటే దానికి ఈ దుస్థితి కలిగి ఉండేదే కాదని స్పష్టమవుతోంది.

ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మించి విశేషాధికారాలు ఉంటాయి. యావత్ పోలీస్ వ్యవస్థతో పాటు కేంద్ర బలగాలు కూడా ఎన్నికల సంఘం అధీనంలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు అందరూ ఎన్నికల సంఘానికి లోబడి పనిచేయాల్సిందే. ఎన్నికల సంఘం అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేదు.

మరి ఎన్నికల సంఘం ఇంత శక్తివంతంగా ఉన్నప్పుడు, రాష్ట్రంలో అల్లర్లను ఎందుకు నివారించలేకపోయింది? రాష్ట్రంలో అల్లర్లు జరిగినా, అధికార పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్‌ బూత్‌లో జొరబడి ఈవీఎం ధ్వంసం చేసినా కేంద్ర ఎన్నికల కమీషన్‌ మొట్టికాయలు వేసేవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? అనే ప్రశ్నకు ముఖేష్ కుమార్‌ మీనాయే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

జరిగిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ అల్లర్ల నుంచి గుణపాఠం నేర్చుకుందా?ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా జరిపిస్తుందా లేదా? అనేది జూన్ 4వ తేదీన తెలుస్తుంది.

ప్రళయానికి ముందు నెలకొన్న నిశబ్ధంలా పోలింగ్‌కు ముందు ఏపీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఈసీ సరిగ్గానే అంచనా వేసింది. ఎట్టి పరిస్థితులలో కౌంటింగ్‌ ప్రక్రియకు అవరోధాలు, అవకతవకలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమీషనర్‌ ముఖేష్ కుమార్‌ మీనాని ఆదేశించారు.

కౌంటింగ్‌ రోజున రాష్ట్రంలో మళ్ళీ ఎటువంటి అల్లర్లు జరుగకుండా నివారించేందుకు మరో 20 కంపెనీల కేంద్ర బలగాలు ఏపీకి వస్తున్నాయి. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విదిస్తున్నట్లు ముఖేష్ కుమార్‌ మీనా ప్రకటించారు. ఈసీ ఆదేశం మేరకు జూన్ 19వ తేదీ వరకు రాష్ట్రంలో కేంద్ర బలగాలు మోహరించి ఉంటాయని ముఖేష్ కుమార్‌ మీనా చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories