విశాఖలో లులు…అనకాపల్లిలో లారెస్…

Lulu Mall Vizag Return

కూటమి రాకతో ఇటు రాజధాని అమరావతి తో పాటుగా అటు విశాఖకు రాజధాని కళ సంతరించుకుంటుంది. వైసీపీ హయాంలో విశాఖే రాజధాని అంటూ నానా హంగామా చేసిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ విశాఖలో చేసిన అభివృద్ధి మాటలకే పరిమితం.

ఒక్క ఋషి కొండ ప్యాలస్ నిర్మాణం మినహాయించితే గత ఐదేళ్లలో విశాఖలో జరిగిన నిర్మాణాలు శూన్యమనే చెప్పాలి. కొత్త పరిశ్రమలు రాక పోగా ఉన్న పరిశ్రమలు కూడా వైసీపీ రాజకీయాన్ని తట్టుకోలేక విశాఖ తీరాన్నే కాదు ఏకంగా రాష్ట్ర సరిహద్దులను కూడా దాటిపోయాయి.

ADVERTISEMENT

2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు యాజమాన్యం మొగ్గు చూపింది, అందుకు అవసరమైన నిబంధనలను కూడా అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. కానీ 2019 లో ప్రభుత్వాలు మారడంతో లులు మాల్ విశాఖనే కాదు ఏపీని కూడా దాటిపోయింది.

తిరిగి 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త పరిశ్రమలను ఆహ్వానించడంతో పాటు గతంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన సంస్థలను తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అందులో ఒకటే ఈ లులు మాల్.

విశాఖ బీచ్ రోడ్ హార్బర్ పార్క్ సమీపంలో సుమారు 13.83 ఎకరాల స్థలంలో లులు మాల్ ఏర్పాటుకు ప్రభుత్వం భూ అనుమతులు కేటాయించింది. G+3 మోడల్ లో 13.50 లక్షల చదరపు అడుగుల బిల్డ్ అప్ ఏరియాలో ఈ మాల్ నిర్మాణం జరగనుంది.

ఇక 1.70 లక్షల చ. అడుగులలో లులు షాల్స్, మిగతా 3.30 లక్షల చ. అడుగులలో ఇతర షాపుల నిర్మాణం చేపట్టనుంది. అలాగే సుమారు 6 లక్షల చ. అడుగుల విస్తీర్ణంను పార్కింగ్ కోసం కేటాయించనున్నారు. మొత్తం సుమారు 1066 కోట్ల నిర్మాణంతో ఈ ప్రాజెక్ట్ ను వచ్చే మూడేళ్ళలో పూర్తి చేసే లక్ష్యంగా ముందుకెళ్లనుంది.

అలాగే ఇటు విజయవాడ పరిధిలోని RTC సంస్థకు చెందిన సుమారు 4 ఎకరాల భూమి లులు మాల్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయంలో రాష్ట్రాన్ని వీడిన ఈ మాల్ నేడు కూటమి రాక తో రాష్ట్రంలోని రెండు కీలక నగరాలలో మాల్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తద్వారా అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఇక ఇదిలా ఉంటే అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఫెజ్ -2 లో లారెస్ ఫార్మా సంస్థకు ప్రభుత్వం 531ఎకరాల భూమి కేటాయించింది. అయితే మూడు ఫెజ్లలో గాను సుమారు 5630 కోట్లతో ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా సుమారు 6 వేలమంది కి ఉపాధి లభించనుంది. అయితే 2029 నాటికీ ఫెజ్ పనులు పూర్తి చేసే లక్ష్యంగా అడుగులు వేయనుంది.

ఇక 2033 నాటికీ మొత్తం మూడు ఫెజ్లలో ఉత్పత్తులు అందుబాటులోకి తేనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఒక పక్క విశాఖలో లులు మాల్ ఏర్పాటు మరోపక్క అనకాపల్లి లో లారెస్ వంటి ఫార్మా కంపనీ నిర్మాణంతో విశాఖ తో పాటు ఆ సమీప ప్రాంతాలు కూడా పెట్టుబడుల దిశగా అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి.

ఇక విశాఖను ఐటీ హబ్ గా తయారుచేసే పనిలో భాగంలో ఐటీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే టీసీఎస్, కాంగ్నిజెంట్ వంటి ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలకు విశాఖలో భారీ స్థాయిలో భూ కేటాయింపులు జరిపారు. ఇక ఇప్పుడు లులు మాల్ ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. లారెస్ విస్తరణకు ప్రణాళికలు రెడీ అయ్యాయి.

రాజధాని అంటూ వైసీపీ విశాఖ ప్రజలకు అరాచకం అనే ముసుగు తొడిగి భూదందాలకు పాల్పడితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనే అస్త్రంతో పరిశ్రమలను ఆహ్వానిస్తూ రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. దీనితో వైసీపీ మాటలకు కూటమి చేతలకు మధ్య ఉన్న అంతరం విశాఖ వాసులతో పాటుగా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories