క్షిపణులు చేయగలం కానీ టపాకాయలు కాదు

Made in India or Made in China? The Diwali Market Truth

భారత్‌ అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహాలను, వాటిని మోసుకువెళ్ళే అంతరిక్షనౌకలను తయారు చేయగలదు. బ్రహ్మోస్ వంటి క్షిపణులను తయారు చేయగలదు. యుద్ధ నౌకలు, వందే భారత్‌ రైళ్ళను కూడా తయారు చేయగలదు. ఇలాంటి ‘హై ఎండ్ ప్రొడక్ట్స్’ జాబితా చాలా పెద్దదే ఉంది. ఇది మనకి చాలా గర్వకారణం.

ట్రంప్‌ ఆంక్షలు, సుంకాలకు విరుగుడుగా దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలుచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పైగా అనేక ఉత్పత్తులపై జీఎస్టీ పూర్తిగా తొలగించి లేదా భారీగా తగ్గించి ప్రోత్సహించారు కూడా.

ADVERTISEMENT

కనుక దేశ ప్రజలు దసరా, దీపావళి పండగలకు కార్లు, మోటార్ సైకిల్స్, స్కూటీలు, బంగారు నగలు, బట్టలు వగైరా భారీగా కొనుగోలు చేశారు. అయితే అవన్నీ దేశీయంగా తయారైనవేనా?అంటే కాదనే చెప్పాలి.

ఈసారి కూడా ఎప్పటిలాగే దీపావళికి చైనా టపాసులు, లైట్లు భారతీయ మార్కెట్‌ని ముంచెత్తాయి. కానీ విశేషమేమిటంటే, అవన్నీ మేడిన్ ఇండియా, మేరా భారత్ మహాన్ బొమ్మలు, లేబిల్స్‌తో చైనా నుంచే దిగుమతయ్యాయని మార్కెట్లో వ్యాపారులే చెపుతున్నారు.

తమకు ఈ సీజన్‌లో వ్యాపారం చాలా ముఖ్యం కనుక చైనా కంపెనీలు తాము కోరుకున్నట్లే టపాసుల ప్యాకెట్లు, బాక్సులపై మేడిన్ ఇండియా, మేరా భారత్ మహాన్ బొమ్మలు, లేబిల్స్ ముద్రించి మరీ పంపిస్తున్నాయని చెప్పారు.

కానీ చైనా నుంచి ఇన్ని వేలు, లక్షల కోట్ల విలువగల సరుకు ‘మేడిన్ ఇండియా’ లేబిల్స్‌తో భారత్‌కి దిగుమతి అవుతుంటే, వాటిని మార్కెట్లో బహిరంగంగా అమ్ముతుంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియదనుకోలేము. కానీ చైనా సరుకు అడ్డుకోలేని నిసహాయ స్థితిలో కేంద్రం ఉంది. కనుకనే చైనా మాల్ భారతీయ మార్కెట్లను, ఇళ్ళను ముంచెత్తుతున్నాయి. భారత్‌లో చైనా మాల్ డంపింగ్ చేస్తుంటే ఇంతకీ ఏ శక్తి కేంద్రాన్ని అడ్డుకుంటోంది?

ఈ ‘మేడిన్ ఇండియా’ హిపోక్రసీనే నటుడు ప్రకాష్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఓ దీపావళి మార్కెట్‌ వీడియోని షేర్ చేశారు. అది చూసినప్పుడు మనం రాకెట్లు, క్షిపణులు, యుద్ధ నౌకలు, రైళ్ళు దేశీయంగా తయారుచేసుకోగలం. కానీ అగ్గిపెట్టెలు దీపావళి టపాకాయలు తయారు చేసుకోలేమా? అని సందేహం కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories