మరో హీరోయిన్ అకౌంట్ హ్యాక్… ఏం పోస్ట్ చేసింది..?

Madonna Premam Actress Account Hack (2)ప్రముఖ సినీ నటి చెన్నై సోయగం త్రిష, సింగర్ సుచిత్రలా టాలీవుడ్ యువనటి మడోన్నా సెబాస్టియన్ వాపోతోంది. ఇటీవలే తన ట్విటర్‌ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని త్రిష ఆవేదన వ్యక్తం చేయగా, తాజాగా ‘సుచీలీక్స్’ పేరుతో కోలీవుడ్ సీక్రెట్లన్నీ బయటపెడుతున్న సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే నాగచైతన్య సరసన నటించిన హీరోయిన్ సెబాస్టియన్ కూడా చేరింది.

మళయాలం రీమేక్ ‘ప్రేమమ్’ సినిమాలో నటించిన మడోన్నా సెబాస్టియన్… తన ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయిందని పేర్కొంది. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పిన మడోన్నా తాను మళ్లీ ప్రకటించే వరకు తన ఫేస్ బుక్ పేజ్ నుంచి వచ్చే పోస్టులు లేదా ఫోటోలను పట్టించుకోవద్దని అభిమానులకు సూచించింది. ఇది ఇబ్బంది కలిగించే పరిణామమే అయినా తప్పదని పేర్కొంది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

ADVERTISEMENT

అయితే అదృష్టవశాత్తు సుచిత్ర ట్విట్టర్ ఎకౌంటు మాదిరి, ఈ ఫేస్ బుక్ అకౌంట్ లో ఎలాంటి సంచలన విషయాలు వెల్లడించకపోవడం విశేషం. అయితే తన ఎకౌంటు హ్యాక్ అయ్యి ఉండి కూడా, తను ఎలా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిందో అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఎవరిదైనా అకౌంట్ హ్యాక్ అయితే, సదరు అకౌంట్ కు సంబంధించిన హక్కులన్నీ వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. కానీ, సెబాస్టియన్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరగడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories