ప్రిన్స్ – ప్రభాస్ ల మధ్య సాగిన ఉత్కంఠ పోరు!

Prabhas-Mahesh-babu SIIMA Awardsఆన్ లైన్లో నిర్వహించిన ఓటింగ్ ద్వారా అవార్డులను ఎంపిక చేసి అందించనున్న ‘సైమా’ సినీ అవార్డులలో 2015 సంవత్సరానికి గానూ టాలీవుడ్ ఉత్తమ నటుడు విభాగంలో తీవ్ర ఉత్కంఠ పోరు నెలకొంది. ఈ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజుల నుండి ‘నువ్వా – నేనా’ అన్నట్లు సాగిన ‘ప్రిన్స్ – ప్రభాస్’ల మధ్య పోటీ చివరి వరకు అదే తీరున సాగడం విశేషం.

బరిలో అయిదుగురు హీరోలు నిలువగా ‘శ్రీమంతుడు’ సినిమాకు గానూ మహేష్ కు 1 శాతం ఆధిక్యంతో పట్టం కట్టారు. 40 శాతం ప్రిన్స్ కైవసం చేసుకోగా, ‘బాహుబలి’ సినిమాకు గానూ ప్రభాస్ కు 39 శాతం ఓట్లు లభించాయి. ఇక, మధ్యలో ఫేక్ ఓట్లు పడ్డ అల్లు అర్జున్ మూడవ స్థానంతో సరిపెట్టుకోగా, నాని, వరుణ్ తేజ్ లు ఆ తర్వాత వరుసలో నిలిచారు.

ADVERTISEMENT

దీంతో 1 శాతంతో ఆన్ లైన్ విభాగంలో ప్రిన్స్ జయకేతనం ఎగురవేసారు. అయితే ఇదే తుది ఫలితమా? లేక సైమా సెలక్షన్ కమిటీ ఓట్లు కూడా ఉంటాయా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఉత్తమ నటుడు విభాగంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత పోటీ ఈ ఇద్దరి హీరోల మధ్య నెలకొంది. అసలు ట్విస్ట్ ఏమిటంటే… ‘టెంపర్’ చిత్రానికి గానూ జూనియర్ ఎన్టీఆర్ బరిలో లేకపోవడం..!

ADVERTISEMENT
Latest Stories