
11 మంది ఎమ్మెల్యే లతో అసెంబ్లీ లో అడుగు పెట్టలేక హోదా సాకు చెప్పి అసెంబ్లీ సమావేశాలకు గైరుహాజరవుతున్న వైసీపీ, మండలిలో మాత్రం తమకున్న బలంతో ప్రభుత్వానికి ధీటుగా తమ గళం వినిపించడానికి సిద్దపడింది.
అయితే ఇక్కడ కూడా వైసీపీ వ్యూహాలకు చెక్ పడే రోజులు అతి తొందరలోనే రానున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ ఎమ్మెల్సీ లు, రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామా చేస్తూ ప్రత్యర్థి పార్టీల వైపు పక్క చూపులు చూస్తున్నారు.
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!
ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే ఆ పార్టీ మరో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు కూడా వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ సైకిలెక్కారు. ఇక ఇటు శాసన మండలిలోనూ వైసీపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగానే కనిపిస్తుంది.
వైసీపీ అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ ఫ్యాన్ రెక్కల నుంచి తప్పుకునే ప్రతయ్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్సీ లు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మా రాజీనామాలపై రాజీ పడకుండా ఆమోదం తెలపండి మహా ప్రభో అంటూ మండలి చైర్మన్ మోషేను రాజు కి చేతులు జోడించి మరి విజ్ఞప్తులు చేస్తున్నారు.
Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!
ఇక ఇదే బాటలో నేడు మరో వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీ పార్టీ నుండి పక్కకు తప్పుకోబోతున్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మర్రి రాజశేఖర్ ప్రకటన విడుదల చేయనున్నారు. చిలకలూరు పేట వైసీపీ నేతగా గుర్తింపు దక్కించుకున్నమర్రి విడుదల రజని రాకతో జగన్ బాధితుడిగా, రజని బందీగా మారిపోయారు.
విడుదల రజని కోసం తానూ త్యాగం చేసిన సీటు కు న్యాయం చేసే బాధ్యత నాది అంటూ మర్రి కి హామీ ఇచ్చిన జగన్ గత ఐదేళ్ల కాలంలో ఆయనకు చేసిందేమి లేదు. దానికి తోడు విడుదల రజని మంత్రి పదవితో మర్రి తన సొంత పార్టీలో విపక్ష నేతగా మారిపోయారు. దీనితో మర్రి రాజశేఖర్ రెడ్డి అసంతృప్తిని ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి పరచాలని చూసిన ఈ ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమిని ఎదుర్కొంది.
Also Read – ఒకేసారి అన్ని హంగులతో అమరావతి.. అందరూ రెడీయేనా?
దీనితో ఇక వైసీపీ కి తన రాజీనామా తో గుడ్ బై చెప్పి మరో పార్టీ కండువా కప్పుకోవడానికి మర్రి సిద్దమయినట్టు వార్తలు హల చల్ చేస్తున్నాయి. ఇలా వైసీపీలో ఒక పక్క అందగాళ్ళ అరెస్టుల పర్వం నడుస్తుంటే, మరో పక్క వైసీపీ సౌమ్యుల రాజీనామాల పర్వం నడుస్తుంది.
వై నాట్ 175 అంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన వైసీపీ ఇప్పుడు తమ పార్టీలో ఉన్న నేతలను కూడా కాపాడుకోలేక నానా తిప్పలుపడుతుంది. దీనితో అసలు వైసీపీలో ఎం జరుగుతుంది..వాట్ అమ్మ వాట్ ఈజ్ థిస్ అంటూ వైసీపీ సానుభూతి పరులు తలలు పట్టుకుంటున్నారు.