జగన్ హయంలో సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను వేధించగా, విద్యావిధానంలో చేసిన మార్పులతో విధ్యార్ధుల జీవితాలతో ఆడుకున్నారు.
బొత్స సత్యనారాయణ అయిష్టంగా విద్యాశాఖ మంత్రిగా పదవి చేపట్టడంతో ఆ కోపావేశాలు ఉపాధ్యాయులపై ప్రదర్శించేవారు. కానీ ఉన్నత విద్యావంతుడైన నారా లోకేష్ ఏరి కోరి విద్యాశాఖని స్వీకరించడంతో విద్యావిదానంలో, పాఠశాలలలో చక్కటి మార్పులు కనిపిస్తున్నాయిప్పుడు.
ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తుండటంతో పాఠశాలలో మళ్ళీ చక్కటి వాతావరణం ఏర్పడింది.
జగన్ విద్యావిధానాన్ని సమూలంగా మార్చేయాలని అనుకున్నారే తప్ప ఏనాడూ విద్యావేత్తలతో, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యావిధానం ఏవిదంగా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
పైగా స్కూలు బ్యాగులు మొదలు పిల్లలకు ఇచ్చే చిక్కీ ప్యాకెట్ల వరకు ప్రతీదానిపై తన బొమ్మలు వేసుకొని పాఠశాలలకు వైసీపీ రాజకీయాలు విస్తరించే నీచమైన ప్రయత్నాలు చేశారు.
అందుకు పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వం నేడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు కోట్లమందితో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్-2.0 నిర్వహిస్తోంది.
దీనిలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో సహాయ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతీ ఒక్కరూ వారి వారి జిల్లాలు, నియోజకవర్గాలలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి విద్యార్ధులు, వారి తల్లితండ్రులతో ముఖాముఖీ సమావేశమై పాఠశాల స్థితిగతులు, విద్యాభోధన, పిల్లల చదువులు, ఫలితాలు, మధ్యాహ్న భోజనం వంటి ప్రతీ విషయం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వం అంటే ఇదే కదా?
దీనిని మెగా పేరెంట్స్ మీటింగ్ అని చెపుతున్నప్పటికీ, ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు, దాతలను కూడా ఆహ్వానించారు. అలాగే పాఠశాలల యాజమాన్య కమిటీల సభ్యులు, ఆయా ప్రాంతాలలోని విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆయా పాఠశాలకు సంబందించి ప్రతీ విషయం రికార్డ్ చేసుకుంటున్నారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరూ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీటీసీ పాఠశాలలో జరుగుతున్న ఈ మెగా పీటీఎం-2.0లో పాల్గొన్నారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుడుగా మారి పిల్లలకు ‘వనరుల’ గురించి పాఠం చెపుతుంటే, మంత్రి నారా లోకేష్ కూడా విద్యార్ధులతో పాటు బెంచీపై కూర్చొని ఆయన చెప్పేది శ్రద్ధగా విన్నారు.
విద్యా వ్యవస్థని ప్రక్షాళనం చేసేస్తామని చెప్పిన జగన్ ఏనాడూ ఈవిదంగా అందరితో ముఖాముఖీ సమావేశం కాలేదు. బొత్స సత్యనారాయణ ఆ శాఖే వద్దనుకున్నారు కనుక ఏనాడూ ప్రభుత్వ పాఠశాలలని సందర్శించలేదు.
కానీ ఇప్పుడు సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లితండ్రులతో మాట్లాడుతున్నారు. సంస్కరణలంటే బైజూస్ ఆన్‌లైన్ పాఠాలు, ఇంగ్లీష్ మీడియం కావు.. ఇవీ!




