మెగాస్టార్ రేంజ్… చిరంజీవిపై జాతీయా మీడియా..!

thota tharani chiranjeeviమెగాస్టార్ చిరంజీవిని పూర్తిస్థాయి హీరోగా అభిమానులు వెండితెరపై వీక్షించి దాదాపుగా 9 సంవత్సరాలు గడిచిపోయాయి. 2007లో విడుదలైన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత ‘మగధీర, బ్రూస్ లీ’ చిత్రాలలో కాసేపు అలా తళుక్కుమన్నారు. అయితే ఎన్నాళ్ళుగానో వేచిచూసిన ప్రశ్నకు ఈ ఏడాది జవాబు లభించింది. తన ప్రతిష్టాత్మక సినిమాకు ఇటీవలే శంకుస్థాపన చేసిన మెగాస్టార్, మరికొద్ది రోజుల్లోనే ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నారు. దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం చెన్నైలో ఓ జైలు సెట్ ను వేస్తున్నారు. ప్రముఖ కళానైపుణ్యత కలిగినటువంటి తోటతరణి గారి నేతృత్వంలో జరగనున్న ఈ సెట్ పై జాతీయ మీడియాలోనూ కధనాలు ప్రసారం కావడం విశేషం. ఓ ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ మెగాస్టార్ సినిమాను ప్రస్తావిస్తూ… చిరంజీవి జైలు నుండి పరారయ్యే సందర్భం కోసం ఓ భారీ జైలు సెట్ ను చెన్నైలో వేస్తున్నారని ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

ADVERTISEMENT

సహజంగా తెలుగు సినిమాలపై జాతీయా మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ఏవో ‘బాహుబలి’ వంటి ఒకటి, అర సినిమాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే చిరు 150వ సినిమా గురించి ప్రత్యేకించి ప్రస్తావించడంతో… సహజంగానే అందరి చూపులు అటు వెళ్ళాయి. సినిమాలు విడిచి రాజకీయాల్లోకి వెళ్లి, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత చిరు నటిస్తున్న సినిమా కావడంతోనే ఆ స్థాయి ప్రాధాన్యత దక్కిందని పరిశీలకులు భావిస్తున్నారు. మొదలు కాకముందే నేషనల్ మీడియాను తన వైపుకు తిప్పుకుంటే… విడుదలయ్యే పాటికి బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందో..? మెగా ఫ్యాన్స్ కు అయితే పిచ్చ కిక్ ఇవ్వడం ఖాయం..!

ADVERTISEMENT
Latest Stories