ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్టులలో విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. దీని కోసం గతంలోనే చాలా గట్టిగా ప్రయత్నించారు కానీ కేంద్రంతో విభేధాలు ఏర్పడటంతో ముందుకు సాగలేకపోయారు.
Also Read – ఒకేసారి ముగ్గురి హీరోలకు బ్రేక్ ఇచ్చేలా ఉంది!
ఆ తర్వాత అధికారం చేపట్టిన జగన్ కనీసం మెట్రో గురించి ఆలోచన కూడా చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం, ఎన్డీయేలో కీలకంగా మారడంతో మెట్రోని మళ్ళీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే మెట్రో ఎలాగూ రెండు నగరాలలో ప్రధాన కూడళ్ళ మీదుగా సాగుతుంది. దాని కోసం ఎలాగూ భూసేకరణ చేయాల్సి ఉంటుంది. కనుక మరికొంత ఖర్చు చేసి కిందన వాహనాలు, పైన మెట్రో కారిడార్ ఏర్పాటుకు వీలుగా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు నిర్మించినట్లయితే, మళ్ళీ వేరేగా ఫ్లై ఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉండదు.
Also Read – ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా!
ఆ మేరకు ఖర్చులు కలిసి వస్తాయని నిపుణులు, అధికారుల సూచనలకు నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.
కోకత్తాలో ఈవిదంగా 16 కిమీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు నిర్మించారు. దానికి రూ.8,565 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కనుక ఏపీలో ఈ రెండు ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు.
Also Read – ‘ముద్రగడ’ పోయి…’జోగయ్య’ వచ్చారా.?
దీని కోసం సిఎం చంద్రబాబు నాయుడు, అవసరమైతే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు కేంద్రంతో మాట్లాడి ఒప్పించి నిధులు సాధించుకోవాలని భావిస్తున్నారు.
విశాఖ, విజయవాడ రెండు నగరాలలో కలిపి మొత్తం 142.90 కిమీ పొడవునా మెట్రో కారిడార్ దాని కోసం డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. కేంద్రం దీనిని అంగీకరిస్తే రాబోయే నాలుగేళ్ళలో దశల వారీగా నిధులు విడుదల చేస్తుంటే 2029 లోగా చకచకా పనులు పూర్తి చేయవచ్చు.
డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు నిసందేహంగా చాలా చక్కటి ప్రతిపాదనే. అయితే మెట్రో నిర్వహణ, ప్రభుత్వానికి, నిర్వహణ సంస్థకు కూడా చాలా భారంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం అన్ని విదాల అభివృద్ధి చెంది, ఇంకా శరవేగంగా అభివృధ్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలో అన్ని మార్గాలలో కలిపి రోజుకి సుమారు 4.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నా హైదరాబాద్ మెట్రో సంస్థ నిర్వహణ ఖర్చులకు కటకటలాడుతోంది.
మరి విశాఖ, విజయవాడ నగరాలలో ప్రతీరోజూ అంతకంటే ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణిస్తారా? లేకపోతే మెట్రో భారం ఎవరు భరిస్తారు?
మెట్రో నిర్మాణం, నిర్వహణ రెండూ కూడా చాలా భారమైనవే అని మెట్రో గురూ ఈ శ్రీధరన్ ఎప్పుడో చెప్పారు. మెట్రో నిర్మాణానికి అయ్యే సగం ఖర్చుతో ఎంఎంటిఎస్ రైళ్ళు ఏర్పాటు చేసుకొని లాభసాటిగా నడిపించుకుంటే మంచిదని సూచించారు.
కానీ అమరావతి నిర్మాణ పనులు పూర్తయ్యేసరికి, విశాఖలో ఐటి కంపెనీలు ఏర్పాటయ్యే సరికి ఈ రెండు నగరాల జనాభా రెండు మూడు రెట్లు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కనుక మెట్రో నిర్వహణ భారం కాబోదని భావిస్తోంది. కేంద్రం ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా గుడ్డిగా నిధులు మంజూరు చేస్తుందని ఆశించలేము.