తెలంగాణ మంత్రులందరూ సైలెంట్… అందుకేనా?

Minister Harish Raoమాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, జ్యూడిషియల్ రిమాండ్‌పై జైలుకి వెళ్ళడంపై తెలంగాణలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే తరచూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడే తెలంగాణ మంత్రులెవరూ ఇంతవరకు దీనిపై స్పందించలేదు. మంత్రి హరీష్‌రావు ఒక్కరే చంద్రబాబు నాయుడుని జైల్లో వేసిన్నట్లున్నారు,” అని మాత్రమే అన్నారు.

ఆయన కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి, జైలుకి పంపించడాన్ని ఖండించలేదు.. అలాగని సమర్దించలేదు కూడా. ఏపీ మంత్రులతో పోలిస్తే తెలంగాణ మంత్రులు మంచి పరిణతితో మాట్లాడుతుంటారు. చాలా హుందాగానే వ్యవహరిస్తుంటారు. కనుకనే ఎవరూ తొందరపడి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడటం లేదు.

ADVERTISEMENT

త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతుండటం, తెలంగాణలో ఆంద్రాకు చెందినవారు లక్షలమంది ఓటర్లు ఉండటం వారి మౌనానికి ప్రధానకారణంగా కనిపిస్తోంది.

అయితే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కె లక్ష్మణ్ మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించారు. కేవలం రాజకీయకక్షతోనే చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT
Latest Stories