జగన్‌ రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలేనా?

Nara Lokesh

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2024లో జరిగాయి. కానీ వాటి కోసం 2019లో జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే అనేక వ్యూహాలను అమలు చేయడం మొదలుపెట్టారు.

వాలంటీర్ల నియామకాలు, సచివాలయాలు, సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తుండటం, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాలు, ప్రజల మద్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ ముఖ్యనేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీయడం, ముఖ్య నేతలను వారి సొంత నియోజకవర్గాలలో దెబ్బ తీయాలని ప్రయత్నించారు.

చంద్రబాబు నాయుడుతో సహా ముఖ్యనేతలు, కార్యకర్తలపై కేసులు, వేధింపులు, అరెస్టులు, వైసీపీ రంగులు, వైఎస్సార్ పేర్లు, జగన్‌ ఫోటోలు, స్టిక్కర్లు.. ఇలా ఒకటా రెండా.. అనేకం చేశారు.

ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికలలో దారుణంగా ఓడిపోయారు. కనుక తన ఆలోచనలు, ధోరణి తప్పు అని జగన్‌ ఒప్పుకోలేదు కనుక అంగీకరించడం లేదు కూడా. నేటికీ అటువంటి దురాలోచనలు, కపట వ్యూహాలతోనే రాజకీయాలు చేస్తున్నారు.

ఇందుకు తాజా ఉదాహరణగా.. రాజమండ్రి సమీపంలో రోడ్ ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల పేరుతో చేసిన శవ రాజకీయాలు కనిపిస్తున్నాయి.

ఆయన హైదరాబాద్‌ శివారులోనే ఓసారి రోడ్ ప్రమాదానికి గురయ్యారని, కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పామని, కానీ ఆయన వినకుండా ముందుకు సాగిపోయారని, ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసిన జాతీయ రహదారి వైద్య సిబ్బంది చెప్పారు.

ఆ తర్వాత రాజమండ్రి శివారులో ఆయన రోడ్‌పై నుంచి పక్కనే ఉన్న పల్లపు ప్రాంతానికి జారిపడిపోయిన వీడియోని ఏపీ పోలీసులు విడుదల చేయడంతో ఆయన రోడ్ ప్రమాదంలో చనిపోయారని తేలిపోయింది.

కానీ ఆయనని హత్య చేసి అక్కడ పడేసి రోడ్ ప్రమాదంలో చనిపోయారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అబద్దాలు చెపుతోందంటూ వైసీపీ సొంత మీడియా, కేఏ పాల్ వాదించారు. చనిపోయిన వ్యక్తి పాస్టర్ కనుక క్రీస్టియన్ సంఘాలు కూడా ఆందోళనలు చేశాయి. వారి వెనుక ఎవరున్నారో వేరే చెప్పక్కరలేదు.

కానీ జగన్‌ సొంత మేనత్త విమలా రెడ్డి, పాస్టర్ ప్రవీణ్ పగడాల సోదరుడు దీనిపై అనవసరమైన వివాదాలు సృష్టించవద్దని, పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు చెప్తారు కనుక సంయమనం పాటించాలని హితవు పలికారు.

వారిరువురూ ప్రభుత్వం, పోలీసులపై నమ్మకం వ్యక్తం చేస్తుంటే, వైసీపీ ఇంకా శవరాజకీయాలు చేస్తుండటంపై మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ, “జగన్‌ ఎన్నడూ ముఖాముఖి ఫైట్ చెయ్యలేరు. ఎప్పుడూ కుల, మత, ప్రాంతీయ విభేధాలు రెచ్చగొడుతూ దొంగ చాటు రాజకీయాలు చేస్తుంటారు,” అని అన్నారు.

ఎన్నికల సమయంలో జగన్‌, “నేను ఒంటరిగా ధైర్యంగా పోటీ చేస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక జనసేన, బీజేపిలతో పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తున్నారు,” అంటూ పదేపదే చెప్పేవారు.

కానీ జగన్‌ ఎప్పుడూ డొంక తిరుగుడు రాజకీయాలే చేసేవారని, నేటికీ అలాగే చేస్తున్నారని పాస్టర్ మరణంపై చేస్తున్న శవ రాజకీయాలే ఇందుకు తాజా నిదర్శనమని మంత్రి నారా లోకేష్‌ చెప్పిన మాట కాదనగలమా?

ADVERTISEMENT
Latest Stories