కొడాలి: జగన్ ఎకరం10 కోట్ల నుండి 1 కోటికి తెచ్చాడు.!

Kodali Nani

జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో అన్ని అద్భుతాలే, నూటికి 98 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటూ ఉదరకొడుతున్న వైకాపా నాయకులు అవాస్తవాలను ఎక్కువ కాలం మోయలేరు అనేలా నిన్న శాసనసభలో మాజీ మంత్రి కొడాలి నాని ఉన్న వాస్తవాన్ని కళ్ళముందుకు తెచ్చారు.

ఈ రాష్టంలో జగన్ అధికారం లోకి రాక ముందు రాజధాని ప్రాంతంలో ఎకరం 10 కోట్లు ఉన్న విలువను ఎకరం 1 కోటికి తీసుకువచ్చారు, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ఆ భూమి విలువ పది కోట్లకు చేరుతుంది అంటూ సాక్ష్యాత్తు అసెంబ్లీ లో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వ్యాఖ్యానించారు కొడాలి నాని.

ADVERTISEMENT

అంటే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో భూమి విలువ ఈస్థాయిలో పడిపోయిందని వైసీపీ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టేగా. ఇన్నాళ్లుగా రాష్ట్రానికి జగన్ చేసిన అభివృద్ధి ఇదేనా అంటూ నోరెళ్లబెడుతున్నారు ఏపీ ప్రజలు. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి పనులు చేస్తే ఆ ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది.

తద్వారా ప్రభుత్వానికి ఆదాయమార్గాలు ఏర్పడతాయి. దీని వలన ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. రాష్ట్రంలో పేదరికరం తగ్గి ఉచిత పథకాల రూపంలో ఇచ్చే తాయిలాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఈ సారి ఎన్నికలలో 175 కి 175 స్థానాలలో మేమే గెలుస్తాం అంటూ చెపుతున్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికి అమరావతిని ‘భ్రమరావతి’ అంటూ తన పార్టీ నాయకులతో కించపరచడం ఏమాత్రం న్యాయమో సమాధానం చెప్పాలి.

అలాగే జగన్ కూడా ప్రతి రాష్ట్రానికి హైద్రాబాద్, ముంబై, చెన్నై వంటి ఒక మహానగరం కావాలి అందుకే మేము విశాఖను మహానగరం గా మారుద్దాం అని నిర్ణయించుకున్నాం అంటూ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి అది విశాఖే కావాలి అని పరోక్షంగా ఒప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడింది అంటూ వికేంద్రికరణ సిద్ధాంతాన్ని చెప్పిన జగన్ ఒకే మహానగరం తో అభివృద్ధిని ఎలా కేంద్రీకరిస్తారు..?

అంటే వైసీపీ ప్రభుత్వం “మాటలతో మూడు రాజధానులు చేతలతో ఒక్క రాజధాని” అని తేల్చేసిందిగా.! బాబు ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత భూమి విలువ అమాంతం పెరిగిపోయింది అని చెప్పిన కొడాలి కనీసం జగన్ ప్రకటించిన రాజధాని ప్రాంతమైన విశాఖలో కూడా భూమి విలువ ఎంత పెరిగిందో చెప్పుకోగలరా..? ఇదే ఒక ప్రభుత్వ స్థిరత్వానికి అస్తిత్వానికి ఉన్న తేడా..! ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు, ప్రజలకు వాస్తవాలు వివరించినందుకు కొడాలి నానిని అభినందించక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories