కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ-1 నిందితుడుగా అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై బయటకొచ్చేశాడు. కానీ మూడు రోజులకే బెయిల్ లభించింది. ఆదివారం ఉదయం అనంతబాబు తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల కోసం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం పలు షరతులు విధించి మూడు రోజులు బెయిల్ మంజూరు చేసింది.
· బెయిల్ కోసం రూ.25,000 సెక్యూరిటీ బాండ్, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు ఇవ్వాలి.
· బెయిల్‌పై బయటకు స్వగ్రామం ఎల్లవరం వెళ్లినప్పుడు మూడు రోజులు ఇంట్లోనే ఉండాలి. అంత్యక్రియలకు మాత్రమే బయటకు రావచ్చు. ఎట్టి పరిస్థితులలో ఎల్లవరం గ్రామ సరిహద్దులు దాటడానికి వీల్లేదు.
· బెయిల్‌పై ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కేసు గురించి ఎవరితోనూ మాట్లాడరాదు. కుటుంబ సభ్యులు, బంధువులను తప్ప వేరెవరినీ కలవరాదు.
· బెయిల్‌పై అనంతబాబు బయట ఉన్న మూడు రోజులు పోలీసులు అతని వెంట ఉంటూ ఇతరులు ఎవరూ అతనిని కలవకుండా అడ్డుకోవాలి.
· ఆగస్ట్ 25వ తేదీ మధ్యాహ్నం 2గంటలలోగా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి అధికారులకు లొంగిపోయి హాజరు నమోదు చేసుకోవాలి.



