తస్మాత్ జాగ్రత్త … మళ్ళీ మళ్ళీ జనాలు ఒప్పుకోరు..!

Modi Ban Big Notes Fake Currency Terror Resultsప్రధాని మోడీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో మన దేశ కరెన్సీ లో సింహ భాగం అయిన 500, 1000 రూపాయల నోట్లకి కాలం చెల్లింది. నల్లధనాన్ని నియంత్రించడం కోసం గత రెండు సంవత్సరాలుగా మోడీ నల్ల కుభేరులకు ఇచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోకపోవడం వలన విసుగు చెందిన ప్రధాని ఇటువంటి వ్యుహాత్మక నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిందని విశ్లేషకుల మాట!

మన దేశంలో నల్లధనం ఎంతుందో అదే విధంగా నకిలీ కరెన్సీ కుడా అంతే ఉందన్నది నమ్మలేని నిజం. ప్రధాని తీసుకున్న నిర్ణయం వలన కొంతమేర సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు లోనయినప్పటికీ, దేశం కోసం తప్పదు అని కొన్ని రోజులు సరిపెట్టుకోవాలని మోడీ తన ప్రసంగంలోనే పేర్కొన్నారు. అయితే ప్రజలు ఈ ఇబ్బందులను వారి భావితరాల భవిష్యత్ కోసం ఎదుర్కొన్న తరువాత కూడా ఈ వ్యవస్థ ప్రక్షాళన కాకపొతే మరోసారి ఇటువంటి ఆకస్మిక నిర్ణయాలను స్వీకరించడానికి ప్రజానీకం సిద్ధంగా ఉండదు అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి.

ADVERTISEMENT

నిజంగా, నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలంటే ఈ నల్లధనం ఎక్కువగా మన ప్రజా ప్రతినిధులుగా చెలామణి అవుతున్న రాజకీయ నాయకుల దగ్గరే ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. అది ఈ పార్టీ వారు, ఆ పార్టీ వారు అనే తేడానే ఉండదు. ఇక్కడ అందరు సమానమే. కుల, మత రాజకీయాలు చేసే మన రాజకీయ వ్యవస్థలో వీరందరిది ఒకే కులం అది ‘రాజకీయ’ కులం, ఒకే మతం అది ‘అవినీతి’ మతం. ముందుగా ప్రజా ప్రతినిధులలో, ప్రభుత్వ ఉద్యోగులలో మార్పు వస్తే మన దేశం దానంతట అదే అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది.

మన దేశంలో ఇప్పుడున్న పెద్ద నోట్లకి నూకలు చెల్లాయి అని బాధపడడం కన్నా, నల్లధనానికి, నకిలికి నూరేళ్ళు నిoడాయి అని ఆనంద పడదాo! ఇకనైనా, ఈ కరెన్సీకి “నలుపు-తెలుపు,” “అసలు-నకిలీ” అనే వైరస్ రాకుండా ప్రభుత్వాలు ముందస్తు “వ్యాక్సిన్లు” వేయాలని సామన్య ప్రజానీకం కోరిక. అంతకు మిoచి ప్రభుత్వాల నుండి సామాన్యులు ఆశించేది ఏముంటది! ఈ నిర్ణయంపై ఎవరి ఒత్తిడిలకు లొంగకుండా, ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా, విజయవంతంగా అమలు చేయాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories