భారత్‌పై 25 శాతం సుంకాలతో పాటు రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానా కూడా విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా భారత్ ఆర్ధిక వ్యవస్థ ఓ “చచ్చిన ఆర్ధిక వ్యవస్థ” అని ఈసడించుకున్నారు.
రష్యాతో మాట్లాడి యుద్ధం ఆపించేస్తానని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్క్రీని వైట్ హౌస్‌కి రప్పించి అమెరికన్ మీడియా సమక్షంలో ట్రంప్ దారుణంగా అవమానించారు.
అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇతర దేశాలు, వాటి దేశాధినేతల గురించి ఇంత చులకనగా మాట్లాడటం తగునా?ఆయా దేశాల వ్యవస్థలను, విధానాల గురించి ఈవిదంగా మాట్లాడటం తగునా? అంటే కాదనే చెప్పవచ్చు.
ట్రంప్ నిర్ణయం ప్రకటించి, భారత్ ఆర్ధిక వ్యవస్థ గురించి ఇంత చులకనగా మాట్లాడినప్పటికీ మోడీ ప్రభుత్వం సంయమనం పాటించిందే తప్ప ట్రంప్‌లా నోటికి వచ్చినట్లు మాట్లాడలేదు. ఒక్క ముక్క మాట్లాడకుండానే ట్రంప్‌కు ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది.
సుమారు లక్ష కోట్లతో అమెరికా నుంచి ఎఫ్-35 యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనుకుంది. కానీ ట్రంప్ మాట్లాడిన తర్వాత ఆ ఒప్పందంపై ముందుకు సాగాలనుకోవడం లేదని భారత్ అధికారులు అమెరికాకి తెలియజేశారు!
అంటే ట్రంప్ భారత్‌పై 25 శాతం సుంకాలు, జరిమానా విధిస్తే, అమెరికాకు లక్ష కోట్ల డీల్ వదులుకోవాలన్న మాట! కానీ అంత మాత్రాన్న ఈ డీల్ రద్దు చేస్తుందని కాదు కానీ… అవసరమైతే రద్దు చేయగలమని ట్రంప్‌ని మోడీ హెచ్చరించినట్లే.
ఒకవేళ భారత్‌పై పన్నుల విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తప్పకుండా డీల్ రద్దు కావచ్చు. ట్రంప్ వంద మాటలు మాట్లాడితే ప్రధాని మోడీ ఒక్క ముక్క మాట్లాడకుండా ట్రంప్‌కి సైలంట్‌గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు.
భారత్ ఆర్ధిక వ్యవస్థ ‘చచ్చిన వ్యవస్థ’ అని ట్రంప్ అన్నారు. కానీ ఆ చచ్చిన వ్యవస్థే అమెరికాకు లక్ష కోట్ల బిజినెస్ ఇస్తోందిగా! ట్రంప్ అది వద్దనుకుంటారా?




