ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌ని భారత్ ఏకిపడేసినట్లుగా, పార్లమెంటులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నంద్యాల టీడీపి ఎంపీ బైరెడ్డి శబరి ఏకి పడేశారు.
నేడు మహిళా రిజర్వేషన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, “గత వైసీపీ ప్రభుత్వ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు పీడకలగా నిలిచాయి. నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై భౌతిక దాడులు జరుగుతూ ఉండేవి. సోషల్ మీడియాలో సుమారు 85 హ్యాండిల్స్ (ఖాతాలు) ద్వారా వైసీపీ ప్రత్యర్ధి పార్టీల నేతలపై, వారి ఇంట్లో ఆడవాళ్ళపై దాడులు జరిగాయి.
నాడు మాజీ సిఎం చంద్రబాబు నాయుడుని శాసనసభలోనే చాలా దారుణంగా అవమానించారు. నాడు సిఎంగా ఉన్న జగన్ సమక్షంలోనే చంద్రబాబు నాయుడు భార్యపై కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని, వారి ఆడపిల్లలపై కూడా సోషల్ మీడియాలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసేవారు.
మహిళల పట్ల ఇంత అనుచితంగా, దారుణంగా వ్యవహరించిన వైసీపీకి ఈ మహిళా రిజర్వేషన్స్ బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? అని పార్లమెంటులో ప్రశ్నించారు ఎంపీ బైరెడ్డి శబరి.
మహిళల విషయంలో వైసీపీ వైఖరిని ఆమె ఎండగడితే, రాజధాని అమరావతి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఎండగట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ బిజేపి ఎంపీ కె. లక్ష్మణ్ కూడా రాజ్యసభలో జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనని ఎద్దేవా చేశారు.
అంటే వైసీపీ కీర్తి ప్రతిష్టలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకే కాదు యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు, చివరికి పార్లమెంటు వరకు కూడా పాకిపోయాయన్న మాట! అందుకు సంతోషించాల్సిందే!
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, వైఎస్ షర్మిల ఇద్దరూ తమ అన్న జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపిస్తూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ కాలకేయ సైన్యం తమపై విరుచుకుపడుతూనే ఉందని పిర్యాదు చేస్తూనే ఉన్నారు.
ఆస్తుల పంపకాలలో తన కొడుకు జగన్ తన చెల్లిని ఆమె పిల్లలను మోసం చేశాడని విజయమ్మ స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈవిధంగా ఇంటా బయటా కూడా మహిళలు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల తీరుని ఆక్షేపిస్తూనే ఉన్నారు. కానీ ఆయనతో సహా పార్టీలో ఏ ఒక్కరి తీరు మారలేదు. వైసీపీలో అందరూ మావిగన్, రప్పా రప్పా అంటూ నవ్వుల పాలవుతూనే ఉన్నారు. అయినా కూడా వైసీపీలో పై నుంచి కింద వరకు ఏ ఒక్కరికీ తప్పు దారిలో నడుస్తున్నామనే అనుమానం కూడా లేకపోవడం ఇంకా గొప్ప విషయం… కదా?
YSRCP పాలనలో 5 సంవత్సరాలు… ఆంధ్రప్రదేశ్ మహిళలకు అంధకార కాలంగా మారాయి.
Social Media లో జరిగిన దాడుల్లో 90%కి పైగా మహిళలపైనే లక్ష్యంగా జరిగాయి.
Chandrababu గారి భార్యను టార్గెట్ చేశారు…
Pawan Kalyan గారి 14–15 ఏళ్ల కుమార్తెలను కూడా అవమానించారు.
మహిళలను అవమానించిన పార్టీకి…… pic.twitter.com/CA5aFS6q10
— M9 NEWS (@M9News_) April 16, 2026




