
రఘురామ కృష్ణరాజు వైసీపిలో ఉండగానే అనేక చిత్రహింసలు, వేధింపులు, అవమానాలు భరించాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆయన సరైన పార్టీ, సరైన నాయకుడు వైపు మారారో అప్పటి నుంచి ఆయనకి ఎంత గౌరవ మర్యాదలు లభిస్తున్నాయో, ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే సరైన పార్టీ, సరైన నాయకుడిని గుర్తించడం చాలా అవసరం అన్న మాట!
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
అదే తప్పు దోవలో ప్రయాణిస్తున్న జగన్‌ని గుడ్డిగా అనుసరించినవారు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. వారిలో వైసీపి నేతలు మొదలు లక్షల సంఖ్యలో వాలంటీర్లు, సోషల్ మీడియా కార్యకర్తలున్నారు.
జగన్‌ని గుడ్డిగా నమ్మి ‘పేరు’ ప్రతిష్టలని పోగొట్టుకున్నవారిలో ముద్రగడ పద్మనాభ రెడ్డి కూడా ఒకరు. ఆయన జగన్ పక్షాన్న చేరక ముందు ఏవిదంగా గౌరవ మర్యాదలు పొందేవారు… జగన్ పక్షాన్న చేరాక ఏవిదంగా నవ్వుల పాలయ్యారో అందరూ చూశారు.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
జగన్ మాటలను గుడ్డిగా నమ్మినందుకు చివరికి ముద్రగడ తన పేరుని కూడా మార్చుకోవలసి వచ్చింది. ఇంత కంటే దౌర్భాగ్యం ఏముంటుంది?
కానీ ఇంత వయసు, ఇంత అనుభవం, ఇన్ని చేదు అనుభవాల తర్వాత కూడా ఆయనకు ఇంకా జ్ఞానోదయం కలుగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read – డీలిమిటేషన్: రాజకీయ లెక్కలు సరిచూసుకోవలసిందే!
సిఎం చంద్రబాబు నాయుడుని దుమ్మెత్తిపోయాలని జగన్ పిలుపునివ్వగానే వైసీపి నేతలతో పాటు ఆయన కూడా రంగంలో దిగిపోయారు.
సిఎం చంద్రబాబు నాయుడు దుష్టుడు, దుర్మార్గుడు, ప్రజలను మోసం చేసేవాడు అంటూ పెద్ద లేఖ వ్రాసి పడేశారు. అధికారంలోకి వచ్చిన 4-5 నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలన్నీ అమలుచేయకపోవడం పెద్ద నేరమన్నట్లు సిఎం చంద్రబాబు నాయుడుని తిట్టిపోశారు.
కానీ గత 5 ఏళ్ళలో జగన్ ఏవిదంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టించేశారు? అదే సిఎం చంద్రబాబు నాయుడు కేవలం 4-5 నెలల్లో రాష్ట్రాన్ని ఏవిదంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నారు?అని బేరీజు వేసుకొని చూసిన్నట్లు లేదు ముద్రగడ పద్మనాభ రెడ్డి.
సిఎం చంద్రబాబు నాయుడుని అందరూ తిట్టాలని జగన్ ఆదేశించారు కనుక అదే తన తక్షణ కర్తవ్యం అన్నట్లు తిట్టిపోశారు. కానీ జగన్‌ని నమ్ముకొని తల్లి, చెల్లితో సహా బాగుపడినవారు లేరు. కానీ చెడినవారు లక్షల్లో ఉన్నారు. వారిలో తాను కూడా ఒకరినని ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో?