ఆయన ‘నమ్మకం’ ఓడింది..ఈయన ‘నిర్ణయం’ వికటించింది..!

mudragada-padmanabham-and-alla-ramakrishna-reddy trust on YS jagan

ఒక వ్యక్తి మీద ‘నమ్మకం’ తో తీసుకున్న కొన్ని ‘నిర్ణయాలు’ వారి పాలిట శాపాలుగా మారుతాయి అనడంలో ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నారు వైసీపీలోని కొంతమంది నాయకులు.

వైసీపీ మీద నమ్మకంతో జగన్ ను చూసి తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీలోని ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టాయి. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక సామజిక వర్గ పెద్ద ముద్రగడ పద్మనాభం.

ADVERTISEMENT

ఈ పెద్దాయన టీడీపీ అధికారంలో ఉంటే కులం పేరుతో రాజకీయ పోరాటాలు చేస్తారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి బహిరంగ లేఖలు విడుదల చేస్తారు. పరోక్షంగా వైసీపీ కి మద్దతుగా జగన్ కు అనుకూలంగా రాజకీయాలు నడపడంలో ఈ పెద్దాయనది అందివేసిన చెయ్యి.

అయితే కాలం ఎప్పుడు ఒక్క తీరుగా నడవదు అనేలా గత ఎన్నికలలో పద్మనాభం గారి లేఖలు కానీ, ఆయన పెద్దరికరం కానీ కూటమి దాటికి నిలవలేకపోయాయి. దీనితో జగన్ ను నమ్మి వైసీపీ తీర్ధం పుచ్చుకుని కూటమిని దెబ్బ కొట్టి తీరుతా, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ ను ఓడించి చూపుతా అంటూ శపధాలు చేసిన ముద్రగడ చివరికి మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు.

జగన్ మీద ఉన్న అతి నమ్మకం ముద్రగడ రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది. ఇక ఇదే తరహా ధోరణిలో వైసీపీ లో మరో నేత జగన్ ‘నిర్ణయానికి’ తలవంచి తన రాజకీయ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టుకున్నారు. మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గా కన్నా కూడా కరకట్ట కమల్ హాసన్ గా ప్రసిద్ధి చెందిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఏపీ రాజధాని అమరావతి కి చేసిన ద్రోహానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు.

రాష్ట్ర విభజనతో పీకల్లోతు కష్టాలలో ఉన్న రాష్ట్రానికి రాజధాని మీద కేసులు వేస్తూ ప్రభుత్వానికి మరో గుదిబండలా మారారు ఆళ్ల. జగన్ నిర్ణయాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ తన స్వామి భక్తి కోసం సొంత రాష్ట్రాన్ని, నమ్మి ఓటేసిన సొంత నియోజకవర్గాన్ని నట్టేటముంచారు ఆళ్ల. అందుకు ప్రతిగా చివరికి జగన్ ఆయనకు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు.

దానితో జగన్ మీద అలక పూని అన్నను కాదని పిల్ల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, తల్లి కాంగ్రెస్ తో చేతులు కలిపి చెల్లి షర్మిల చెంతకు చేరారు. అయితే జగన్ ఆదేశాల మేరకు తిరిగి వైసీపీ చెంతకు చేరిన ఆళ్ల 2024 ఎన్నికల తరువాత రాజకీయ వేదికలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.

వీరిద్దరికి ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఒకరిది జగనే గెలుస్తాడు అనే ‘అతి నమ్మకం’ అయితే, మరొకరిది రాజధాని మీదే విషం కక్కాలి అని తీసుకున్న ‘తప్పుడు నిర్ణయం’. వారి నమ్మకం, నిర్ణయాలు ఒకరి కులం పేరును మారిస్తే, మరొకరికి రాజకీయ భవిష్యత్ ను మాయం చేసింది.

ADVERTISEMENT
Latest Stories