పక్కా ప్రణాళిక ప్రకారమే చంద్రబాబుపై దాడులు?

Mudragada-Padmanabhamకాపు ఉద్యమంలో చెలరేగిన అల్లర్ల విషయంలో ప్రభుత్వం సీఐడీ విచారణ చేసి అరెస్ట్ లకు తెరలేపింది. అయితే అరెస్టైన వారంతా అమాయకులు, వారిని వెంటనే విడిచిపెట్టాలని ఉద్యమ నేత ముద్రగడ పంతం పట్టుకుని కూర్చున్నారు. అంతేకాదు, ఈ సారి విజయమో, వీరస్వర్గమో అంటూ గురువారం నుండి నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లుగా ప్రకటించారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా సంచలన ఆరోపణలు చేసారు ముద్రగడ.

తూర్పుగోదావరి జిల్లా తునిలో తాము నిర్వహించిన కాపు ఐక్య గర్జనలో చోటు చేసుకున్న హింస వెనుక టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హస్తం ఉందని సరికొత్త వాదనకు తెరలేపారు. కాపులను చీల్చేందుకు కుట్రలు పన్నుతున్న చంద్రబాబు… ఆ క్రమంలోనే తునిలో విధ్వంసానికి తెర తీశారని ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం లోగా అరెస్ట్ చేసిన కాపు యువకులందరినీ విడుదల చేయాలని, లేని పక్షంలో దీక్షకు దిగడం ఖాయమని ప్రకటించారు.

ADVERTISEMENT

‘తుని ఘటన వెనుక చంద్రబాబు’ ఉన్నారని, ఇన్నాళ్ళ వరకు ఆరోపించని ముద్రగడ, సరికొత్తగా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో… ముద్రగడ వెనుక ఉన్నదెవరు? అన్న ఆసక్తి మరోసారి పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నేతలు చెప్తున్నట్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ ప్రకారమే అంతా జరుగుతోందా? అన్న ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ విధంగా ఆలోచనలు చేసేలా ఊతమిచ్చింది జగన్ మరియు ముద్రగడలు కలిసి చంద్రబాబుపై చేసిన ఆరోపణలే..!

‘రైతు భరోసా యాత్ర’ అంటూ జగన్ అనంతపురం జిల్లాలో నిర్వహించిన యాత్రలో చంద్రబాబుపై ప్రతిపక్ష ఏ స్థాయిలో మండిపడ్డారో తెలిసిన విషయమే. సరిగ్గా జగన్ స్వరం తగ్గే సమయానికి, కాపు నేత ముద్రగడ చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం ఊపిరి సలపనివ్వకుండా జరుగుతున్న వరుస ఉదంతాలు, పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయన్న రాజకీయ విశ్లేషకుల ఆలోచనలకు బలాన్ని ఇస్తున్నాయి. అంటే టిడిపి నేతలు ఆరోపిస్తున్న ‘ముద్రగడ వెనుక జగన్’ స్టోరీ మొత్తం నిజమేనా? ఏమో రాజకీయాల్లో ఎప్పుడు, ఏమైనా జరగవచ్చు కదా..!

ADVERTISEMENT
Latest Stories