‘శ్రీమంతుడు’ నిర్మాతలు పట్టేసారుగా!

Mythri Moivie Makers Got Pawan Kalyan Call Sheetనిర్మించిన తొలి సినిమానే ప్రిన్స్ మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ మొదలుపెట్టి, ఆ తర్వాత దిగ్విజయంగా జూనియర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ను పూర్తి చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ ను కూడా ‘శ్రీమంతుడు’ నిర్మాతలు పట్టేసినట్లు ట్రేడ్ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది మాత్రం తేలాల్సి ఉంది.

ADVERTISEMENT

మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత పవన్ – త్రివిక్రమ్ ల సినిమా మొదలు కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటుగా షూటింగ్ జరుగుతుందా? లేక త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత మొదలు పెడతారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎప్పటి మాదిరిగానే, ఇది కూడా ఓ రీమేక్ సబ్జెక్ట్ అన్న విషయం హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories