ఈ విషసంస్కృతికి వైసీపీ బలికాకుండా తప్పించుకోగలదా?

Nadendla-Manohar-JanaSenaఏ పార్టీకైనా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావలనే ఉంటుంది. వచ్చాక ఎప్పటికీ తామే అధికారంలో ఉండిపోవాలనే ఉంటుంది. మొదటిది సాధ్యమేమో కానీ రెండోది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కాదు. ఇప్పటివరకు అనేక వందలాసార్లు ఇది నిరూపించబడింది.

ADVERTISEMENT

ఈవిషయం వైసీపీకి ఇంకా బాగా తెలుసు. కనుకనే తొలిరోజు నుంచే సంక్షేమ పధకాలపేరుతో ఓటర్లకు అధికారికంగా డబ్బు పంచడం మొదలుపెట్టింది. అయితే అదొక్కటే సరిపోదని కూడా తెలుసు. అందుకే టిడిపిని అడ్డుతొలగించుకోవాలని నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తోంది.

జగన్‌ కూడా కేసీఆర్‌ పద్దతిలోనే టిడిపి నేతలకు గాలం వేసి వైసీపీలో చేర్చుకొని ఉంటే ఇంత చెడ్డపేరు వచ్చి ఉండేది కాదు. తెలంగాణలో లాగా టిడిపి బలహీనపడి ఉండేదేమో?కానీ జగన్‌ తనకు తెలిసిన పద్దతిలోనే టిడిపిని అడ్డు తొలగించుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలే ప్రజలలో వైసీపీ పట్ల విముఖతని పెంచుతున్నాయని చెప్పక తప్పదు.

టిడిపి నేతల, వారికి మద్దతు ఇస్తున్న వ్యక్తులు, సంస్థల ఆర్ధికమూలాలను దెబ్బతీయడం, రాళ్ళు, కర్రలు, కత్తులతో భౌతిక దాడులకు పాల్పడటం, టిడిపి కార్యాలయాలను తగులపెట్టడం, టిడిపి నాయకులు, కార్యకర్తలు, చివరికి యువగళం వాలంటీర్లపై పోలీస్ కేసులు పెట్టి, అరెస్ట్‌ చేసి, కోర్టులు చుట్టూ తిప్పడం, వీలైతే జైళ్ళకు పంపించడం వంటివన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు.

అయితే ఈ నేరాలన్నిటినీ టిడిపి, జనసేనలకే ఆపాదిస్తూ వైసీపీ నేతలు వితండవాదం చేయవచ్చు. పోలీసులు కేసులు నమోదు చేయవచ్చు గాక. కానీ ఇవన్నీ తప్పని అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రజలకు బాగా తెలుసు.

కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించి మళ్ళీ టిడిపి లేదా జనసేనకో అధికారం కట్టబెడితే, అప్పుడు వైసీపీ నేతల పరిస్థితి ఏమిటి? ఇంతకాలం వారి ఆగడాలకు బలైపోయిన టిడిపి, జనసేనలు వైసీపీ నేతలను క్షమించి విడిచిపెడతాయా? వారికి వత్తాసు పలుకుతున్న అధికారులను, ముఖ్యంగా పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉంటాయా? అంటే ఉండవని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టిన్నట్లు చెపుతున్నారు.

తాము అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులపై ఇంతకు ఇంతా ప్రతీకారం తీర్చుకొంటామని చెపుతున్నాయి. కొడాలి నాని వంటివారిని గుడ్డలూడదీసి గుడివాడ రోడ్లపై తిప్పుతామని నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. అంటే వైసీపీ సృష్టించిన ఈ పగ, ప్రతీకారాల విషసంస్కృతికి భవిష్యత్‌లో ఏదో ఓరోజున వారు కూడా బలికాక తప్పదని స్పష్టమవుతోంది.

ఇలాంటి ట్రీట్‌మెంట్ మనకు అవసరమా? అని రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆలోచించి ఉంటే ఈవిదంగా ప్రవర్తించరు. కానీ ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే భ్రమలో ఉన్నవారికి మాత్రం ఈ విషసంస్కృతే చాలా పైశాచికానందం కలిగిస్తుంటుంది కనుక తనివితీరా అనుభవిస్తున్నారనుకోవాలేమో?

జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ ఈరోజు తెనాలిలో ‘మా మొదటి ఓటు జనసేనకే’ అనే పోస్టర్‌ను విడుదల చేసినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి, దాడులు చేసే విషసంస్కృతిని వైసీపీ ప్రవేశపెట్టింది. మరొక్క ఆరు నెలలు ఓపికపడితే వైసీపీ దుశ్చర్యలన్నిటికీ ముగింపు వస్తుంది,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories