గోవా వేదికగా హిందూ మత సంప్రదాయం ప్రకారం అక్కినేని నాగచైతన్య – సమంతల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యుల నడుమ జరిగిన ఈ పెళ్లిలో చైతూ – శ్యాం జంట ఎంత ఆనందంగా ఉన్నారో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలే చెప్తున్నాయి. నేడు క్రైస్తవ మతాచారం ప్రకారం ఈ జంట మరోసారి పరిణయం ఆడనుంది. ఇంత బిజీలోనూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ సందడి చేయడం అనేది… “అక్కినేని వారి పెద్ద కోడలు స్పెషాలిటీ”గా కనపడుతోంది.
చైతూ – సమంతల వివాహాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు చేసిన ట్వీట్ కు కృతజ్ఞతలు చెప్తూ… ప్రారంభించిన సమంత, ఆ క్రమంలో సెలబ్రిటీలందరికీ ఒక్కొక్కరిగా ధన్యవాదాలు చెప్తూ రిప్లైలు ఇచ్చింది. వీరి వివాహాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పిన ఏకైక అగ్ర హీరో మహేష్ బాబు కావడం గమనించదగ్గ విషయం. సాధారణంగా వివాహ వేడుకలలో ఎవరి ఫోన్ వారి వద్ద ఉండదు. కానీ రెండు సార్లు పెళ్లి చేసుకునే బిజీలోనూ సమంత సోషల్ మీడియాను ఇంత విరివిగా వినియోగించడం విశేషం.





