సిద్ధాపూర్ పై ప్రిన్స్ సతీమణి చర్చలు!

Namrata Shirodkar meets Jupally Krishna Rao to discuss about siddapur, telangana, mahesh babu, village adoption ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి ప్రత్యేక చర్చలు జరిపారు. తెలంగాణలో మహేష్ బాబు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా సిద్ధాపూర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకునేందుకే నమ్రత వచ్చినట్టు సమాచారం. గత నెల 29వ తేదీన నమ్రత స్వయంగా సిద్ధాపూర్ గ్రామాన్ని సందర్శించి, అభివృద్ధికి పలు సలహా, సూచనలు చేసిన సంగతి తెలిసిందే. గ్రామానికి రోడ్లు, డ్రైనేజ్, నీటి వసతి తదితరాంశాలపై మంత్రి జూపల్లితో నమ్రత చర్చించినట్టు అధికారులు తెలిపారు.

నిజానికి మహేష్ ఈ గ్రామంలో పర్యటించాల్సి ఉండగా, విదేశాలకు పయనం అవుతున్న నేపధ్యంలో వెళ్లి వచ్చిన తర్వాత సిద్దాపూర్ కు వెళ్ళానున్నారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత మంత్రి జూపల్లి, నమ్రత ఇద్దరూ మీడియా సమావేశం నిర్వహించి సిద్దాపూర్ అభివృద్ధికి సంబంధించి చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ప్రిన్స్ కుటుంబాన్ని అభినందించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories