లోకేశ్‌ని అరెస్ట్ చేసి యువగళం పాదయాత్రని ఆపగలరా?

Nara-Bhuvaneshwari-Nara-Lokesh-Yuva-Galam-Padayatraటిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టగలిగామని వైసీపి నేతలు సంబరపడుతున్నారు కానీ దాని పర్యవసానాలు ఏవిదంగా ఉండబోతున్నాయో గ్రహించిన్నట్లు లేదు. వారి అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరి కక్షల కోసం వైసీపిలో అందరూ భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదు.

ADVERTISEMENT

చంద్రబాబుని అరెస్ట్ చేయడం వలన ఆయన చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కానీ ఈ కారణంగానే ఏనాడూ ఢిల్లీకి వెళ్ళని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఢిల్లీకి వెళ్ళి జాతీయమీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతిని కూడా కలిశారు. ఆయనకు ఈ అవకాశం కల్పించింది జగన్‌ దుందుడుకుతనమే అని వేరే చెప్పక్కరలేదు.

చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాలను శాశిస్తునప్పటికీ వాటికి దూరంగా ఉంటూ జీవించే ఆయన అర్దాంగి నారా భువనేశ్వరి, వారి కోడలు నారా బ్రాహ్మణి ఇద్దరూ కూడా ఇప్పుడు రాజకీయాలలోకి, ప్రజల మద్యకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే జగన్‌ ఒక బలమైన రాజకీయ శత్రువుని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తే, మరో ఇద్దరు బలమైన మహిళా నేతలు ఉద్భవించారన్న మాట! ఇది కూడా జగన్‌ పుణ్యమే కదా?

నారా లోకేశ్‌ నేడు ఢిల్లీ నుంచి తిరిగివచ్చి యువగళం పాదయాత్రకు సిద్దపడగానే ఆయనను కూడా అరెస్ట్ చేసేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్దంగా ఉందనే వార్తలపై నారా భువనేశ్వరి స్పందిస్తూ, “నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు దానిని అడ్డుకొనేందుకు జగన్ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించిందో ప్రజలందరూ చూశారు. పోలీసులు లోకేశ్ చేతిలో మైకు, తను నిలబడిన స్టూలును కూడా తీసుకుపోయారు. కానీ యువగళం పాదయాత్ర ఆపగలిగారా? లేదు కదా?ఇప్పుడూ ఆపలేరు. ఎట్టి పరిస్థితులలో యువగళం పాదయాత్ర సాగుతుంది.

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అందుకే నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర చేయకుండా అడ్డుకొనేందుకు అతనిపై కూడా తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మాలో ఒకరిని అరెస్ట్ చేస్తే మరొకరు ముందుకు వచ్చి యువగళం పాదయాత్రని కొనసాగిస్తాము. జగన్‌ ప్రభుత్వం ఎంతమందిని అరెస్ట్ చేయగలదు?

యువగళం పాదయాత్ర టిడిపి కోసం చేస్తున్న యాత్రగా మేము ఎన్నడూ భావించలేదు. అది ప్రజల కోసం వారి తరపున చేస్తున్న యాత్ర. అందుకే దానిలో ప్రజలందరూ మమేకం అవుతున్నారు. ఈ ప్రజాయాత్రని జగన్‌ ప్రభుత్వం ఏవిదంగా ఆపగలదు?ఆపితే ఆ ప్రజా ప్రవాహంలో మీరే ములిగిపోతారు,” అని నారా భువనేశ్వరి అన్నారు.

ADVERTISEMENT
Latest Stories