బ్రాహ్మణి మంగళగిరి చీర వైరల్…

Nara Brahmani’s Mangalagiri Saree Goes Viral

మంగళగిరి చేనేత సదస్సులో ప్రసంగించిన ఐటీ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ బ్రాహ్మణి చీర పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళగిరి చేనేత బ్రాండ్ ను పెంచే విధంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ అందుకు తగ్గట్టుగా మరో ముందడుగు వేశారు.

తన సతీమణి నారా బ్రాహ్మణి కి తానూ మంగళగిరి చేనేత చీరను బహుమతి గా ఇవ్వగా బ్రాహ్మణి ఆ చీరను ధరించడంతో ఆ చీర కాస్త వైరల్ అవ్వడంతో, ఒకే షాపులో అదే రంగు చీరను 98 మంది కొనుగోలు చేసారంటూ లోకేష్ సభా ముఖంగా వెల్లడించారు.

ADVERTISEMENT

దీనితో అప్పుడు బ్రాహ్మణి చీర వైరల్ అయినట్టు ఇప్పుడు నారా లోకేష్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదంతా కూడా లోకేష్ చేనేత బ్రాండ్ వాల్యూ ను పెంచేందుకు చేస్తున్న కృషిగా భావించాలి. అలాగే ఆయన సతీమణి బ్రాహ్మణి సైతం మంగళగిరి చీరలను ధరించి లోకేష్ చేస్తున్న కృషికి తనవంతు ప్రోత్సహం అందిస్తున్నారు.

అలాగే ఈ సభలో ప్రసంగించిన లోకేష్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే మంగళగిరిలో మాత్రం త్రిబుల్ ఇంజన్ సర్కార్ పరుగులు పెడుతుందంటూ పేర్కొన్నారు. 2019 ఎన్నికలలో కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఒడిన తానూ 2024 ఎన్నికలలో 50 వేల ఓటమి తేడాతో నెగ్గాలని కష్టపడ్డాను.

కానీ మనగళగిరి ప్రజలు 90 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీ తో తనకు గెలిపించారని, కొన్ని దశాబ్దాల తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరిందంటూ తెలిపిన లోకేష్ తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి జరుగుతున్న ప్రగతిని వివరించారు.

అయితే లోకేష్ తన రాజకీయ ప్రసంగాలలో కూడా అప్పుడప్పుడు ఇలా కుటుంబ విషయాలు, తల్లి భువనేశ్వరి గురించి సతీమణి బ్రాహ్మణి గురించిన విషయాలను సమయం, సందర్భం చిక్కినప్పుడల్లా ప్రజలతో పంచుకుంటారు. ఇది లోకేష్ లో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం గా చెప్పవచ్చు

ADVERTISEMENT
Latest Stories